అక్కినేని కథానాయకులకు పెళ్లిళ్లు బానే కలిసొచ్చాయి

Akkineni heroes after marriage success

“పెళ్లి చేసుకోరా అన్నీ సెట్ అవుతాయి” అని పెద్దోళ్లు చెబితే ఏదో అనుకున్నాం కానీ.. అక్కినేని హీరోల విషయంలో ఈ మాట నిజమైంది. “మనం” తర్వాత సరైన హిట్ లేక కొట్టుమిట్టాడుతున్న నాగచైతన్యకి పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యాక “రారండోయ్ వేడుక చూద్దాం” లాంటి హిట్ దొరకగా.. పెళ్లయ్యాక “మజిలీ” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడింది. దాంతో చైతుకి లేడీ లక్ కలిసొచ్చింది అని చెప్పుకున్నారు.

సమంతతో డివోర్స్ అనంతరం డిజాస్టర్స్ తో ఇబ్బందిపడుతున్న చైతన్యకి.. శోభితతో పెళ్లి అనంతరం “తండేల్”తో హిట్ పడింది. ఇప్పుడు అఖిల్ అక్కినేని విషయంలోనూ ఈ పెళ్లి తర్వాత అదృష్టం అనేది గట్టిగానే కనిపిస్తోంది. ఎప్పుడో 2015లో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అఖిల్ కి సరైన హిట్ అనేది పడలేదు. అటు హీరోగా తన ఉనికిని చాటుకోలేక, నటుడిగా ఎస్టాబ్లిష్ అవ్వలేక చాలా ఇబ్బందిపడ్డాడు.

ADVERTISEMENT

ఎట్టకేలకు “లెనిన్”తో మొట్టమొదటి కమర్షియల్ సక్సెస్ తోపాటు నటుడిగా అప్రిసియేషన్ అందుకుంటున్నాడు అఖిల్. అయితే.. ఈ క్రెడిట్ అఖిల్ కష్టంతోపాటు.. గతేడాది జైనాబ్ ను పెళ్లి చేసుకోవడం వల్ల కూడా అని చెప్పొచ్చు. అఖిల్ దశాబ్దపు కాలం నిరీక్షణ పెళ్లి తర్వాత నెరవేరడం అనేది గమనార్హం.

నాగార్జునకు కూడా 1992లో అమలను పెళ్లాడాకే “ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, రక్షణ, వారసుడు, హలో బ్రదర్” లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఈ లెక్కన అక్కినేని హీరోలకి పెళ్లి బాగానే కలిసొచ్చింది అని చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories