పోలీస్ డిపార్టుమెంటు అంటే ప్రజలలో ఎందుకు ‘అదో రకమైన’ ఫీలింగ్ ఉంటుందో అని చెప్పడానికి నిదర్శన ఈ వీడియో. స్టేషన్ లో విధులు నిర్వహించే ఓ మహిళా హోంగార్డ్ తో ఏఎస్ఐ మసాజ్ చేయించుకుంటూ మీడియాకు దొరికిపోయిన సంఘటన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో జరిగింది. గద్వాలలోని సాయుధ రిజర్వ్ ఏఎస్ఐగా పని చేస్తున్న హసన్ మహిళా హోంగార్డ్ తో మసాజ్ చేయించుకుంటుండగా మీడియాకు దొరికిపోయాడు.
మీడియా రావడాన్ని గమనించిన హసన్ వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి ఆరోపణలు డిపార్టుమెంటుపై ఎప్పటినుండో ఉన్నప్పటికీ, సదరు ఏఎస్ఐ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో, సదరు ఆరోపణలకు కొండంత బలం చేకూరినట్లయ్యింది.
ASI Hasan caught on camera getting massage done by lady Homeguard at Alampur Gadwal Dist #Telangana, higher officials ordered enquiry in this issue pic.twitter.com/rGMZud5Zre
— Nellutla Kavitha (@iamKavithaRao) November 13, 2017





