పార్టీ.., కోసమేనా పుష్పా…!

Allu-Arjun Birthday Partyపుష్ప మూవీ ఇచ్చిన కిక్ తో మాంచి ఊపుమీదున్నారు అల్లు అర్జున్. రీసెంట్ గా జరిగిన గని ప్రమోషన్లో కూడా అల్లు అరవింద్ మాట్లాడుతూ “అల్ల్లు” బ్రాండ్ ని బాలీవుడ్ కి పరిచయం చేసిన అల్లు అర్జున్ ని చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పారు. పుష్ప సినిమా డైలాగ్స్, దేవి శ్రీ పాటలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యాయో అందరికి ఎరుకే.

పుష్ప సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన తరువాత జరుపుకునే పుట్టిన రోజు వేడుకలకు ఉండే కిక్కే వేరప్పా అంటున్నారు బన్ని ఫ్యాన్స్. ఎం పుష్ప., పార్టీ లేదా…? అంటూ సోషల్ మీడియాలో మిమ్స్ తో చెలరేగిపోతున్నారు ఫ్యాన్స్. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న అల్లు అర్జున్ కు ప్రముఖుల నుండి విషెస్ వెల్లువలా కురుస్తున్నాయి.

ADVERTISEMENT

‘జన్మదిన శుభాకాంక్షలు’ బన్నీ, పని పట్ల నువ్వు చూపించే పట్టుదల,కష్టపడే తత్వం నీకు విజయాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ ల్యాండ్ మార్క్ విజయంతో నీ పుట్టిన రోజు వేడుకలు ఎప్పటికి గుర్తుండి పోయేలా ల్యాండ్ మార్క్ పార్టీ చేసుకో…, అంటూ మెగా స్టార్ చిరంజీవి బన్నీని విష్ చేశారు.

ఇదిలా ఉంటే., అల్లు అర్జున్ తన బర్త్ డే వేడుకలు జరుపుకోవడానికి భార్య స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హ ,లతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్తున్నప్పటి ఎయిర్ పోర్ట్ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు పార్టీ కోసమేనా…, పుష్పా., అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే హాలిడే నుంచి తిరిగి రాగానే పుష్ప- పార్ట్2 సెట్స్ మీదకు తీసుకెళ్తారని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories