బన్నీ .. ఈ స్టెప్పు ఎక్కడో చుసినట్లుందేంటి ?

Allu Arjun Iraga Iragaస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ఫామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చి, అల్లు వారి అబ్బాయిగా ఇమేజ్ సంపాదించుకున్నాడు. డాన్సుల్లో.. మావయ్య మెగాస్టార్ రేంజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్,మెగా హీరోల్లో పై స్థానం లో ఉన్నాడు. మలయాళం లో కూడా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న తెలుగు హీరో అల్లు అర్జున్. నా పేరు సూర్య ..నా ఇల్లు ఇండియా సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. తెలుగు తో పాటు తమిళ్, మలయాళం లో కూడా విడుదల కాబోతుంది.

మొన్న నే ఆడియో రిలీజ్ చేసుకున్న ఈ సినిమా పాటలు క్లాస్ టచ్ ఎక్కువయ్యి, ఒక మోస్తరు గా ఉన్నాయి. ఆడియో ఆల్బం లో ఉన్న ఒకే ఒక్క మాస్ డాన్స్ నెంబర్ – ఇరగ ఇరగ. ఇరగ ఇరగ పాట టీజర్ లో బన్నీ వేసిన స్టెప్పులు మాస్ కోసం అని చూడగానే తెలిసిపోతుంది. డాన్స్ ప్రియులు మాత్రం బన్నీ వేసిన స్టెప్స్ మెగాస్టార్ ఖైదీ నెం 150 సినిమా లో ‘ అమ్మడు లెట్స్ కుమ్ముడు ‘ పాట లో బెల్ట్ స్టెప్పులా ఉన్నది, అని మాట్లాడుకుంటున్నారు. బన్నీ డాన్సులకు తెలుగు ప్రేక్షకులే కాదు, మలయాళ ప్రేక్షకులూ ఫిదా అయిపోయారు, రొటీన్ స్టెప్పులవలన ఎం కలిసివస్తుంది ? ఉన్న పేరు పోతుంది. డాన్స్ మాస్టర్ లను మార్చాలి బన్నీ.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories