‘డోంట్ కేర్’ యాటిట్యూడ్ తో బన్నీ!

Allu - Arjun don not care attitudeఅల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘నా పేరు సూర్య ‘ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ లో విడుదలకు డేట్ ఫిక్స్ చేసుకోవడంతో, పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా షెడ్యూల్స్ చకచకా పూర్తవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో చిత్రీకరిస్తున్నారు. మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ లో… ‘డోంట్ కేర్’ అంటూ గడ్డకట్టించే చలిలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించవని యూనిట్ కి ముందే తెలిసినా, సహజత్వం కోసం సభ్యులంతా కష్టపడుతున్నారు.

ADVERTISEMENT

ముందుగా స్టూడియోలో సెట్ వేసి చిత్రీకరించాలని ఆలోచనలు చేసినప్పటికీ, అనుకున్న ఎఫెక్ట్ రాదనీ, కష్టమైనా సహజంగా ఉండేలా చేద్దామని బన్నీ పట్టుపట్టాడట. దాంతో అక్కడే చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సన్నివేశాలు ఉత్కంఠను పెంచడమే కాకుండా, సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. విశాల్ – శేఖర్ బాణీలను అందించిన ఈ సినిమా నుంచి రెండవ పాటను ఈ నెల 14వ తేదీన వదలనున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories