‘డొనేషన్స్ స్టార్’గా మారుతున్న టాలీవుడ్ టాప్ హీరో!

Allu Arjun donates 25 lakhs to titli cyclone relief fundసామాజిక పరమైన అంశాలలో అల్లు అర్జున్ చూపుతోన్న చొరవ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ప్రకృతి ప్రకోపంతో కకావికలం అయిన కేరళకు తనదైన శైలిలో భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించి, టాలీవుడ్ హీరోలలో టాప్ స్థానంలో నిలిచిన అల్లు అర్జున్, తాజాగా తిత్లీ దెబ్బకు గురైన ఆంధ్రప్రదేశ్ కు కూడా భారీ మొత్తాన్ని ప్రకటించారు.

[m9ad]

ADVERTISEMENT

బాధితులందరికీ సహాయ కార్యక్రమాలను అందించాలని పిలుపునిస్తూ తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఇవ్వనున్నానని బన్నీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇప్పటివరకు ప్రకటించిన హీరోలలో స్టైలిష్ స్టార్ దే అత్యధిక మొత్తం. దీంతో సిల్వర్ స్క్రీన్ పై ‘స్టైలిష్ స్టార్’గా వెలుగొందుతున్న ఈ స్టార్ హీరో, రియల్ లైఫ్ కు వచ్చేపాటికి ‘డొనేషన్స్ స్టార్’గా మారిపోతున్నాడని కితాబిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories