యూ ట్యూబ్ లో రేసు మొదలైంది. పవర్ స్టార్ రేంజ్ ను అందుకునేందుకు స్టైలిష్ స్టార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అవును… ఫిబ్రవరి 4వ తేదీన విడుదలైన పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు” టీజర్, మార్చి 11వ తేదీ నాటికి ఏకంగా 10 మిలియన్ అంటే కోటి క్లిక్స్ ను అందుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కోటి క్లిక్స్ ను అందుకోవడానికి పవర్ స్టార్ కు దాదాపుగా 35 రోజుల సమయం పట్టింది. అయితే ఈ రికార్డుకు ఎసరు పెట్టేందుకు తాను వెనుకే ఉన్నానని బన్నీ చెప్పకనే చెప్తున్నాడు.
అల్లు అర్జున్ “దువ్వాడ జగన్నాధమ్” టీజర్ ను యూ ట్యూబ్ లో ఫిబ్రవరి 23వ తేదీన అప్ లోడ్ చేయగా, ఇప్పటివరకు 9 మిలియన్, అంటే 90 లక్షలకు పైగా క్లిక్స్ ను అందుకుని రేసులో తానేమీ వెనుక లేనంటూ హింట్ ఇస్తున్నాడు. కేవలం 17 రోజుల్లోనే 9 మిలియన్ క్లిక్స్ ను అందుకున్న “దువ్వాడ,” మరో 1 మిలియన్ క్లిక్స్ ను అందుకోవడానికి “కాటమరాయుడు”కు పట్టినంత సమయం (35 రోజులు) పట్టకపోవచ్చు. దీంతో కోటి క్లిక్స్ అందుకున్న పవన్ టీజర్ రికార్డును అనతికాలంలోనే బన్నీ తుడిచిపెట్టడం ఖాయంగా చెప్పవచ్చు.
ఇక లైక్స్ విషయంలో ‘కాటమరాయుడు’కు 2.52 లక్షలు రాగా, ‘దువ్వాడ జగన్నాధమ్’కు 1.67 లక్షలు అందుకుంది. డిస్ లైక్స్ విషయానికి వస్తే పవన్ టీజర్ కు కేవలం 40 వేలు పైచిలుకు రాగా, బన్నీ టీజర్ మాత్రం 1.54 లక్షలు వచ్చి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక కామెంట్స్ అంశంలో మాత్రం ‘రాయుడు’పై ‘దువ్వాడ’దే పైచేయి అయ్యింది. ప్రస్తుతానికి 20 వేలకు పైగా కామెంట్స్ అందుకున్న ‘దువ్వాడ’కు, కేవలం 17 వేల కామెంట్స్ తోనే సరిపెట్టుకున్నాడు ‘రాయుడు.’



