వీక్షకులను ఆకట్టుకుంటున్న దువ్వాడ ‘స్కూటర్’

Duvvada-Jagannadham--Scooterహరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న “దువ్వాడ జగన్నాధమ్” ఫస్ట్ లుక్ వచ్చేసింది. బన్నీ అభిమానుల ఆదరణ చూరగొంటున్న ఈ ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ కంటే హైలైట్ గా నిలిచింది మరొకటి ఉంది. అదే బన్నీ నడుపుతున్న స్కూటర్. ఒక తరాన్ని ఏలిన బజాజ్ చేతక్ స్కూటర్ పై కాయగూరలను వేసుకుంటూ వస్తున్న అల్లు అర్జున్ లుక్ వీక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ లుక్ తో పాటు అల్లు అర్జున్ వినియోగించిన స్కూటర్ ఎక్స్ క్లూజివ్ లుక్ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. చేతక్ స్కూటర్ ముందు వెనుక, పక్కన అంతా కూడా కాయగూరలతో నింపి ఉన్న ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ స్కూటర్ కు పసుపు రంగు వేయడంతో, అది మరింత హైలైట్ గా కనపడుతోంది. అయితే ఈ ‘పసుపు’ రంగు వెనుక ఆంతర్యం ఏమిటో సినిమాలో చెప్తారేమో చూడాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories