అల్లు అర్జున్ రేంజ్ ఏంటి సల్మాన్ ఖాన్ రేంజ్ ఏంటి?

Allu Arjun Duvvada Jagannadham Seeti Maar Song - Salman Khan Radheబాలీవుడ్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘రాధే’ మే 13న థియేటర్స్‌లోనూ అలాగే ఓటీటీలో ఒకేసారి ప్రేక్షకుల ముదుకు రాబోతోంది. కాగా ఈ సినిమా కోసం అల్లు అర్జున్ డీజే సినిమాలోని సీటీమార్ సాంగ్ ను రీమిక్స్ చేశారు. ఆ పాట సల్మాన్ ఖాన్ అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. రాక్‌ స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సీటీమార్ సాంగ్‌కి మ్యూజిక్ అందించాడు.

కాగా సినిమాలోని పాటను విడుదల చేస్తూ ‘ఈ సాంగ్‌లో అల్లు అర్జున్ డాన్స్, స్టైల్ అద్భుతం..చాలా చాలా నచ్చింది..థాంక్యూ బ్రదర్’.. అంటూ సల్మాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ ట్వీట్‌కి అల్లు అర్జున్ స్పందిస్తూ ‘థాంక్యూ సల్మాన్ గారు.. మీ నుంచి కాంప్లిమెంట్ అందుకున్నందుకు సంతోషంగా ఉంది. మీ రాధే సినిమా పెద్ద హిట్ అవాలి..మ్యాజిక్ క్రియేట్ చేయాలి’.. అంటూ ట్వీట్ చేశాడు.

ADVERTISEMENT

అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పాటలోని సల్మాన్ డాన్స్ కు నెగటివ్ రెస్పాన్స్ వస్తుంది. అల్లు అర్జున్ డాన్స్ తో పోలిస్తే సల్మాన్ ఖాన్ తేలిపోయాడని నెటిజెన్లు వ్యాఖ్యానిస్తున్నారు. డీజే సాంగ్ చూడని వారికి మాత్రం పర్వాలేదు అనిపించేలా ఉంది ఈ డాన్స్. చూసిన వారికి మాత్రం అసలు నచ్చదు.

అసలు డాన్స్ లో అల్లు అర్జున్ రేంజ్ ఏంటి సల్మాన్ ఖాన్ రేంజ్ ఏంటి? అని వారు అనడం గమనార్హం. రాధే సినిమా కు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ దర్శకత్వం వహించారు. కరోనా సమయంలో అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో ఒకేసారి విడుదలవుతున్న ఈ సినిమా ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories