పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వసూళ్లు రాబడుతూ ఎన్నో రికార్డులను బద్దలుకొడుతూ తన పేరిట మరెన్నో కొత్త రికార్డులను సృష్టించుకుంటూ ముందుకు దూసుకు పోతూనే ఉంది.
అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఇన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్న పుష్ప తాను సాధించిన రికార్డుల గురించి కాకుండా తన చుట్టూ ముసురుకున్న వివాదాలు గురించి చర్చించుకునే స్థాయికి చేరింది.
సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటనతోనే పుష్ప సినిమా మీద వివాదం మొదలయ్యిందా లేక అంతకు ముందే ఈ సినిమా మీద వివాదాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవని చెప్పలేని పరిస్థితి. పుష్ప సినిమాలో బన్నీ నటించిన పుష్ప రాజ్ పాత్ర మీద అనేక వివాదాస్పద ప్రకటనలు వెలువడిన సందర్భాలను అనేకం ఉన్నాయి.
ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్ప సినిమా మీద ఆ సినిమాలో హీరోగా చేసిన పుష్ప రాజ్ పాత్ర మీద చేసిన వ్యాఖ్యలు. ఇవి అప్పట్లో చాల వైరల్ అయ్యాయి. అయితే ఇందులో పవన్ ఎక్కడ బన్నీ పేరు కానీ పుష్ప సినిమా ఊసు గాను ప్రస్తావించనప్పటికి అవి సూటిగా పుష్ప సినిమా వైపు వేలెత్తి చూపాయి.
కర్ణాట రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఏపీకి కుంకీ ఏనుగులను రప్పించే నేపథ్యంలో కాసేపు మీడియాతో ముచ్చటించారు పవన్. ఈ సందర్భంగా అప్పట్లో అడవులను రక్షించేవాళ్లను సినిమాలలో హీరోలుగా చూసే వాళ్ళం, కానీ ప్రస్తుతం అడవులను నరికేసే వాళ్ళను, స్మగ్లర్లను హీరోలుగా చూస్తున్నాం అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే లేపాయి.
ఇక ఇలా ఈ పుష్ప సినిమా పై వివాదం పవన్ వ్యాఖ్యలతో మొదలయ్యింది. ఇక వాటికీ కొనసాగింపుగా పలువురు రాజకీయ ప్రముఖులు, సోషల్ వర్కర్స్, ప్రవచన కర్తలు ఇలా ఒక్కొక్కరు తమకు అవకాశం వచ్చిన సందర్భాన్ని బట్టి పుష్ప రాజ్ క్యారెక్టర్ మీద పుష్ప సినిమా మీద తమ వ్యతిరేకతను ప్రదర్శిస్తూనే వచ్చారు.
ఈ సినిమా ద్వారా దర్శక నిర్మాతలు, నటి నటులు సమాజానికి ఏ సందేశం ఇవ్వదలచుకున్నారు.? ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వారిని హీరోలుగా చూపెడుతూ వారిని అరికట్టే వాళ్ళను, స్మగ్లింగ్ ను కట్టడి చేసే పోలీసులను విలన్లుగా చూపించడం ఎంత వరకు సమంజసం.? ఇటు వంటి పాత్రలు చేసిన వారికైనా జాతీయ అవార్డులు అంటూ తెలంగాణ మంత్రులు తమ గళం వినిపించారు.
ఇక బన్నీ అరెస్టుతో ఈ వివాదం రాజకీయ రంగు పూసుకొని సినీ పరిశ్రమను భయపెడితే ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు మాత్రం అవకాశాన్ని అందించినట్టయింది. అయితే ఈ వివాదంలో అధికార విపక్షాలు హీరో విలన్ పాత్రలు పోషిస్తే స్పెషల్ క్యారెక్టర్ లో ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు కూడా పుష్ప రాజ్ పాత్ర మీద పుష్ప సినిమా మీద సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఇందులో ACP విష్ణు మూర్తి చేసిన కామెంట్స్ ఒక అడుగు శృతి మించాయనే చెప్పాలి. అలాగే ఈ వివాదం మీద మీడియా ముందుకొచ్చిన సీవీ ఆనంద్ కూడా తన విచక్షణ మరిచి మీడియా అమ్ముడు పోయింది అంటూ కామెంట్స్ చేసి ఇక ఆ పిదప క్షమాణాలు చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇంటర్ వెల్ సీన్ మాదిరి ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన సన్నివేశం అంటే తెలంగాణ అసెంబ్లీ లో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట నుంచి స్టోరీ మొదలు పెట్టిన రేవంత్ ఈ వివాదం పై టాలీవుడ్ ప్రముఖులకు తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇలా పుష్ప బెనిఫిట్ షో తో మొదలైన ఈ వివాదం టికెట్ రేట్ల తగ్గింపు, బెనిఫిట్ షో, ప్రివిలేజ్ షో రద్దు అంటూ తెలుగు చిత్ర పరిశ్రమ వరకు వ్యాపించింది.
ఇలా పవన్ వ్యాఖ్యలతో మొదలైన ఈ పుష్ప వివాదం సంధ్యా థియేటర్ ఘటన ఇక ఆ తరువాత జరిగిన వరుస పరిణామాలు బన్నీ అరెస్ట్, సెలబ్రెటీల పరామర్శలు, సీఎం విమర్శలు, సీఎం కు వ్యతిరేకంగా అల్లు కౌంటర్ ప్రెస్ మీట్లు, పోలీసుల క్లారిఫికేషన్, టాలీవుడ్ ప్రముఖుల రాయబారాలు ఇలా ఈ కథకు ఒక ముగింపు లేకుండా పిక్చర్ అభి బాకీ హై అన్నట్టుగా కామ తో కూడిన ఫుల్ స్టాప్ ఇచ్చారు రేవంత్.




