“నా పేరు సూర్య” రౌండ్ 2 షురూ!

Allu Arjun -Naa Peru Surya - Naa illu India-Promotionsఏప్రిల్ 27వ తేదీన విడుదలకు ముహూర్తం పెట్టుకున్న అల్లు అర్జున్ “నా పేరు సూర్య” సినిమా ప్రమోషన్స్ జనవరిలో ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రౌండ్ లో భాగంగా ‘ఫస్ట్ ఇంపాక్ట్’ పేరుతో సినిమాలో బన్నీ క్యారెక్టర్ ను ప్రేక్షకులకు పరిచయం చేయగా, గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘సైనిక్’ సాంగ్ ను విడుదల చేసి, “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” టైటిల్ కు సార్ధకత ఏంటో చాటిచెప్పారు.

ADVERTISEMENT

ఫస్ట్ రౌండ్ ప్రమోషన్ సక్సెస్ అయిన హుషారులో ఉన్న చిత్ర యూనిట్, సెకండ్ రౌండ్ కు సిద్ధమైంది. తొలి రౌండ్ మాదిరే మరో టీజర్ ను, ఇంకో సాంగ్ ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన ఓ టీజర్ ను విడుదల చేయాలని, అలాగే ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ – అను ఇమ్మానుయెల్ మధ్య రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

ఈ రౌండ్ 2తో ఫిబ్రవరి ప్రమోషన్స్ ముగుస్తాయని, మళ్ళీ మార్చిలో రెండు సింగిల్ సాంగ్స్ ను విడుదల చేసి ఏప్రిల్ విడుదలకు గ్రౌండ్ వర్క్ ను పూర్తి చేయనున్నారు. ఏప్రిల్ 27వ తేదీన విడుదల అని ప్రస్తుతం చెప్తున్నప్పటికీ, ఏప్రిల్ 13న గానీ, 20న గానీ విడుదల కావడం తధ్యం అంటున్నారు సినీ జనాలు. ఎప్పుడు విడుదలైనప్పటికీ, ప్రమోషన్స్ లో మాత్రం ఇతర సినిమాల కంటే ముందు వరుసలోనే ఉంటోంది “నా పేరు సూర్య.”

ADVERTISEMENT
Latest Stories