మియాపూర్ ఆస్తుల అమ్మకాలు…రేవంత్ తప్పటడుగు అవుతుందా.?

Miyapur Land Verdict: Revanth Reddy's Auction Plan Debated

23 ఏళ్లుగా వివాదంలో ఉన్న మియాపూర్ భూముల పై నేడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించినట్లయింది. ఈ తీర్పుతో సుమారు 550 వందల ఎకరాల భూముల పై ప్రభుత్వం హక్కు దక్కించుకోగలిగింది.

అయితే ఇన్నేళ్ళుగా వివాదంలో ఉన్న విలువైన భూములు ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం తెలంగాణ రాష్ట్రానికి మంచి శుభసూచికమనే భావించాలి. అయితే అదే భూములను వేలం ద్వారా అమ్మి ప్రభుత్వం సొమ్ము చేసుకోవాలని చూడడం ఒకరకంగా బాధాకరమనే చెప్పాలి.

ADVERTISEMENT

సుప్రీం కోర్ట్ తీర్పు పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వందల ఎకరాల భూమిని కాపాడేందుకు ఎటువంటి ప్రయత్నాలు చెయ్యలేదని, కొందరి అధికారులను అడ్డుపెట్టుకుని ఈ భూమిని స్వాహా చేసేందుకు అనేకమంది ప్రయత్నాలు చేసారని,

అయితే ఈ భూమిని అమ్మి ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇల్లు, పాఠశాలల నిర్మాణం, నీటి ప్రోజెక్టుల పూర్తి వంటి వాటికీ వినియోగించాలని అనుకుంటున్నట్టుగా రేవంత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు రాష్ట్ర బడ్జెట్ ను అంచనా వేయకుండా రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలను నిలబెట్టుకోవడానికి ఇలా వేలకోట్ల విలువైన ప్రజా భూములను ప్రభుత్వాలు అమ్మడం,

ప్రజాస్తుల వేలం ద్వారా ఉచిత పథకాల పంపకాలు చేయడం ప్రజాస్తులను పరిరక్షించడం ఎలా అవుతుంది.? పార్టీని అధికారంలోకి తేవడానికి ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటూ పొతే రేపటి తరానికి మిగిలేదేమిటి.? గత ప్రభుత్వాలు చేసిన తప్పులని నేటి ప్రభుత్వ పెద్దలు ముందుకు తీసుకెళ్లాలనుకోవడం రేవంత్ వేస్తున్న తప్పటడుగు కాదా.?

ప్రజాస్తులను ఇలా అమ్ముకుంటూ పోతే ఆ వచ్చిన ఆదాయం ఈ ఒక్క ప్రభుత్వానికి సరిపోతుంది. అలా కాకుండా ప్రభుత్వం అదే భూములను లీజుకి ఇచ్చినా, అభివృద్ధి చేసినా తద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రం దీర్ఘకాలం పొందే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వాలు ప్రజాసంపదను కాపాడడం ఎంత ముఖ్యమో దానిని ప్రజల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా బాధ్యతగా వినియోగించడం కూడా అంటే కీలకం. నానాటికి పెరుగుతున్న భూముల విలువ నేపథ్యంలో ఈ రోజు అమ్మకాలకు పెడుతున్న భూముల స్థాయిలో ప్రభుత్వంలో భవిష్యత్ లో భూ కొనుగోళ్లు చేయగలవా.?

ADVERTISEMENT
Latest Stories