అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ… అధికారిక ప్రకటన..!

Allu Arjun next movie announcement in 2 weeksవక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన “నా పేరు సూర్య” బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో, కాస్త గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం కధలు వినే పనిలో ఉన్నారు. ‘నా పేరు సూర్య’ విడుదలై నాలుగైదు నెలలు గడుస్తున్నా, ఇంకా తదుపరి చిత్రంపై స్పష్టత రాకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్న మాట వాస్తవం. ఇదే విషయమై… కాస్త ఆలస్యమైనా మంచి సినిమా చేయాలని భావిస్తున్నానని ఇటీవల అల్లు అర్జున్ చెప్పిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

బహుశా మరో రెండు వారాల్లో బన్నీ చేయబోయే తదుపరి సినిమాపై ఓ అధికారిక ప్రకటన వస్తుందని బన్నీ వాసు తెలిపారు. ప్రస్తుతం కధలు వింటోన్న బన్నీ, ఇంకా ఏది ఫైనల్ చేయలేదని, అభిమానులు ఆశించిన దాని కంటే రెట్టింపుగా నెక్స్ట్ మూవీ చేయాలనే తలంపులో ఉన్నారని బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు స్టైలిష్ స్టార్ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. ఈ నాలుగు నెలల గ్యాప్ లో చాలామంది దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా విక్రమ్ కే కుమార్ కే అవకాశం దక్కవచ్చనేది టాలీవుడ్ టాక్.

ADVERTISEMENT
Latest Stories