పుష్ప… ఏది నిజం?

allu arjun sukumar pushpamovie updateసుకుమార్ దర్శకత్వంలో వస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్పలో మలయాళీ పవర్ హౌస్, ఫహద్ ఫాసిల్ ప్రధాన విలన్ గా కనిపించున్నారు. అతను ఇప్పటికే ఫిల్మ్ షూట్‌లో చేరాడు, అయితే కోవిడ్ రెండవ వేవ్ కారణంగా అతను జాయిన్ కాగానే షూటింగ్ ఆగిపోయింది. రెండు రోజుల క్రితం… తరుణ్ ఈ స్టార్ క్యారెక్టర్ కు తన గొంతును ఇస్తున్నాడని మనం విన్నాము.

తాజాగా తన పాత్రకు తనే డబ్బింగ్ చేస్తాడని నివేదికలు వస్తున్నాయి. ఫహాద్ తన తెలుగులో ప్రావీణ్యం సంపాదించడానికి లాక్డౌన్ సమయాన్ని ఉపయోగిస్తున్నట్లు సదరు వార్తల సారాంశం. ఈ క్యారెక్టర్ యొక్క భాష పర్ఫెక్ట్ గా రావడం కోసం చిత్తూరు మాండలికం యొక్క సూక్ష్మ నైపుణ్యాలను ఫహద్ నేర్చుకుంటున్నారట.

ADVERTISEMENT

అయితే ఈ రెండు వార్తలలో ఏది నిజమనేది తెలీదు. మరోవైపు…పుష్ప ను రెండు భాగాలుగా విడుదల చెయ్యనున్న సంగతి తెలిసిందే. ఒక పాట మరియు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు మినహా ఈ చిత్రం మొదటి భాగం షూటింగ్ పూర్తయింది. అలాగే ఇప్పటికే రెండవ భాగంలో పది శాతం కూడా చిత్రీకరించారు.

ఈ ఏడాది దసరా నాటికి మొదటి పార్ట్ ని విడుదల చేసి రెండవ భాగాన్ని వచ్చే ఏడాది నాటికి విడుదల చెయ్యాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఈ రెండు సినిమాలకు గాను దాదాపుగా 250-270 కోట్ల ఖర్చు పెట్టబోతున్నారట. అల్లు అర్జున్ కేరీర్లో మొట్టమొదటి సారిగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. రష్మిక హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories