మెగా హీరో ఇంట్లో “సూపర్” స్టార్స్!

Allu sirishసిల్వర్ స్క్రీన్స్ పై అద్భుతాలు చేసే మన సినీ స్టార్స్ కు ఉండే క్రేజ్ తెలియనిది కాదు. అది బాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా సరే… ఆ లెక్కే వేరు..! “క్రిష్” సినిమా ద్వారా హృతిక్ రోషన్… “బాహుబలి” ద్వారా ప్రభాస్… ఇక వీటన్నింటికి అతీతుడైన సూపర్ స్టార్ రజనీకాంత్ చేసే హంగామాకు సాధారణ సినీ ప్రేక్షకులే కాదు, సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతారన్న విషయం అల్లు శిరీష్ తాజాగా చెప్పకనే చెప్పాడు.

తన డెస్క్ పైన రజనీకాంత్, హృతిక్‌ రోషన్‌, ప్రభాస్‌ ల ‘కబాలి’, ‘క్రిష్‌’, ‘బాహుబలి’ బొమ్మ‌లు ఉంటాయని, సదరు బొమ్మలను ఓ ఫోటో తీసి ట్విట్టర్ ద్వారా ఈ మెగా హీరో అభిమానులతో పంచుకున్నారు. సాధారణంగా చిన్న పిల్లలకు ఇలాంటి బొమ్మలంటే పిచ్చ క్రేజ్ ఉంటుంది. కానీ దానికి తానేమీ అతీతుడు కాదని, చిన్నపిల్లల మాదిరి తాను కూడా ఇలాంటి బొమ్మలను తెచ్చుకుని ఎంజాయ్ చేస్తానని అల్లు వారి వారసుడు తెలిపాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories