మీటూ… హాట్ టాపిక్ గా ‘ఇద్దరమ్మాయిలు’ బ్యూటీ..!

actress-amala-paul-dares-to-call-them-fakeప్రముఖ తమిళ దర్శకుడు సుశి గణేషన్ పై లైంగిక ఆరోపణలు చేసిన లీనా వ్యాఖ్యలను హీరోయిన్ అమలాపాల్ సమర్ధించింది. సుశి గణేశన్ తో తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురయ్యిందంటూ, ‘తిరుటుపాయలే 2″ సినిమా సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అప్పుడు తాను బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది.

[m9ad]

ADVERTISEMENT

కట్ చేస్తే… తన అభిప్రాయాలను బయటపెట్టిన కొద్దిసేపటికే దర్శకుడు సుశి గణేషన్ మరియు అతని భార్య మంజరిలు ఫోన్ చేసి వేధించినట్లుగా అమలాపాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాను చెబుతున్నది పట్టించుకోకుండా, తన వ్యక్తిత్వాన్ని తప్పుబడుతూ నోటికోచ్చినట్లుగా వ్యాఖ్యానించారని ఆవేదన వ్యక్తం చేసింది.

అంతేకాకుండా వెటకారంగా నవ్వడం వారి పైశాచికత్వాన్ని చాటిందని, లీనాకు తాను పూర్తిగా మద్దతు తెలుపుతున్నానని, తనతో ఇలా ప్రవర్తించిన వారు లీనాతో ఎలా ఉండగలరో తాను ఊహించుకోగలనని తెలిపింది. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా అన్ని ట్రేడ్ వర్గాలలోని ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి, ఒక్క టాలీవుడ్ లో తప్ప..!

ADVERTISEMENT
Latest Stories