నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’ తొలిసారిగా ఓ సినీ వేడుకకు వేదిక అయ్యింది. సాధారణంగానే కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఎక్కువగా ఉండే సినీ అభిమానులు, “డిక్టేటర్” ఆడియో వేడుకకు పెద్ద సంఖ్యలో హాజరై నందమూరి నటిసింహం బాలకృష్ణకు మద్దతు తెలిపారు. వేడుకకు హాజరైన జన సందోహాన్ని చూసి చిత్ర యూనిట్ సంతోషంలో మునిగి తేలుతోంది.
ముఖ్యంగా ఇటీవల కాలంలో బహిరంగ సినీ ఈవెంట్లు సన్నగిల్లడంతో, తమ అభిమాన హీరోల కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ వేదికగా శిల్పకళావేదిక వంటి ఆడిటోరియంలో నిర్వహించే వేడుకలకు వచ్చే అభిమానులు పరిమిత సంఖ్యలో ఉంటారు. బహుశా నందమూరి అభిమానులంతా “డిక్టేటర్” ఆడియో వేడుకతో తమ ఆకలిని తీర్చుకున్నట్టున్నారు.
ఈ వేడుకతో ‘అమరావతి’ గ్రామాల చుట్టూ ప్రక్కల పండగ వాతావరణం నెలకొంది. బాలయ్య చేయబోతున్న సందడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మొట్టమొదటి సారిగా బాలకృష్ణ సినిమాకు ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించబోతున్న ఆడియో మరికొద్ది గంటల్లో అశేష అభిమానుల సమక్షంలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.





