‘సూపర్ స్టార్’కు నోటీసులు జారీ చేసారు!

Amitabh Bachchan get notice from BrihanMumbai Municipal Corporation నిబంధనలకు విరుద్ధంగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లగ్జరీ బంగళా ‘స్వాంక్’ను నిర్మించుకున్నారని ఆరోపిస్తూ, దాన్ని ఎందుకు కూర్చరాదో తెలియజేయాలని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేసారు. అత్యంత విలాసవంతమైన ఈ భవనం ముంబైలోని గోరేగామ్ ఈస్ట్ ప్రాంతంలో ఫిలిం సిటీకి సమీపంలో ఉందన్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

ఈ భవంతిపై ఆరోపణలు రాగా, టౌన్ ప్లానింగ్ అధికారులు తనిఖీలు చేసి, తాము అనుమతించిన విధంగా కాకుండా నిబంధనలు మీరి బంగళాను నిర్మించారని, బేస్ మెంటు, లిఫ్ట్, ప్రహరీగోడ తదితరాలు ఆమోదిత ప్లాన్ ప్రకారం లేవని తేల్చారు. దీంతో బిగ్ బికి నోటీసులు జారీ చేసినట్టు మునిసిపల్ అధికారులు వెల్లడించారు.

ఇదిలా వుండగా, అమితాబ్ బచ్చన్ తో పాటు ముంబై పరిధిలో అక్రమంగా బంగళాలు నిర్మించుకున్నారన్న ఆరోపణలపై నిర్మాతలు రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ వ్యాస్, హరీష్ జగిత్యాని, హరీష్ ఖండేల్ వాల్, పంకజ్ బాలాజీలతో పాటు ఓబరాయ్ రియల్టీ సంస్థకు కూడా మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories