యలహంకలోనే భద్రత లేదనప్పుడు పులివెందులలో భద్రత సరిపోతుందా?

Police security checks during Pulivendula polls

నేడు రాష్ట్రమంతటా జరుగుతున్న పోలింగ్ ఒక ఎత్తు అయితే పులివెందుల పోలింగ్ ఒక్కటీ మరో ఎత్తు అన్నట్లు సాగుతోంది. ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మొహరించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పరిస్థితి చాలా ఉద్రిక్తంగానే ఉందక్కడ.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు పులివెందుల చేరుకున్నారు. మరికొద్ది సేపటిలో పోలింగ్ కేంద్రానికి వస్తారు.

ADVERTISEMENT

జగన్‌ అక్కడకు వస్తునందున సాక్షితో సహా అన్ని మీడియా సంస్థల రిపోర్టర్లు అక్కడకు చేరుకొని కెమెరాలతో సిద్ధంగా ఉన్నారు. వారిలో సాక్షి రిపోర్టర్ అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారితో వాగ్వాదానికి దిగడం విశేషం.

“మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓటు వేసేందుకు వస్తున్నందున ఆయన భద్రత కోసం తనికీలు తప్పనిసరి. కాస్త ఆలస్యమవుతున్నా తప్పకుండా అందరికీ ఓట్లు వేసే అవకాశం కల్పిస్తాం,” అని ఆ పోలీస్ అధికారి చెప్తుంటే, “వీరందరూ మహిళా ఓటర్లు.. వీళ్ళ చేతుల్లో కర్రలు కనిపిస్తున్నాయా మీకు?” అంటూ సాక్షి ప్రతినిధి ఆయనతో వాగ్వాదానికి దిగారు. దీంతో సదరు పోలీస్ అధికారి కాస్త అసహనంగా “మీరు మీడియా ప్రతినిధిలా వ్యవహరిస్తే బాగుంటుంది,” అని చురక వేశారు.

యలహంక ప్యాలస్‌లో మేనకోడలు పెళ్ళి చేసుకుంటేనే తన భద్రత ఉండదని జగన్‌ తేల్చి చెప్పినప్పుడు, ఆయన రాజకీయ ప్రత్యర్ధులు, దస్తగిరి వంటి శత్రువులు ఆ ప్రాంతంలోనే ఉన్నప్పుడు, జగన్‌కు పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆయనకు పూర్తి భద్రత కల్పించే బాధ్యత వారిదే.

జగన్‌ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆయన హెలికాఫ్టర్‌ పైలట్‌కు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తే, దానినీ తప్పు పట్టిన వైసీపీ సొంత మీడియా, జగన్‌ పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు అక్కడ ఏదైనా అవాంచనీయ ఘటన జరిగితే ఊరుకుంటుందా?

అప్పుడు ఆయనతో సహా వైసీపీ నేతలు, వారి సొంత మీడియా అందరూ పోలీసులను, ప్రభుత్వాన్ని నిందిస్తారు కదా?కోర్టులో కేసులు కూడా వేస్తారు కదా? కనుక ఇటువంటి సమయంలో పులివెందులలో కత్తి మీద సాము చేస్తున్న పోలీసులను నిందించడం సబబు కాదు.

ADVERTISEMENT
Latest Stories