‘మెగాస్టార్’ 150వ సినిమా ‘స్పెషల్స్’

Amitabh Bachchan Chiranjeevi 150th Movie, Amitabh Bachchan Special Role Chiranjeevi 150th Movie, Amitabh Bachchan Guest Role Chiranjeevi 150th Filmమెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా సర్వహంగులతో సిద్ధమవుతోంది. ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలలో నిమగ్నమై ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సమాచారం మెగా అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతోంది. అదే… సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అతిథి పాత్ర పోషిస్తున్నాడనే టాక్.

అవును… ‘కింగ్’ నాగార్జున ‘మనం’ సినిమాలో కొద్ది సెకన్ల పాటు దర్శనమిచ్చిన అమితాబ్, తాజాగా చిరంజీవి సినిమాలోనూ ఓ అతిథి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తోన్న సమాచారం. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందో గానీ, మెగా ఫ్యాన్స్ మాత్రం అధికారిక సమాచారం కోసం వేచిచూస్తున్నారు. గతంలో ఓ వేడుకలో… ‘మీరు సినిమా చేస్తే నేను కూడా ఒక పాత్ర పోషిస్తానని’ స్వయంగా అమితాబ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT

అయితే దీనిని బేస్ చేసుకుని ఈ వార్త పుట్టుకొచ్చిందో ఏమో గానీ, మరోసారి మెగాస్టార్ 150వ సినిమా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే ప్రభుదేవా, లారెన్స్ ల పాటల కొరియోగ్రఫీతో మెగా ‘స్టెప్పులు’ ఓ రేంజ్ లో ఉంటాయని ఆశిస్తున్న అభిమానులకు, అమితాబ్ కాంభినేషన్ కూడా జోడయితే, ఈ సినిమా మరింత క్రేజీగా మారిపోవడం తధ్యం. ఇలా అభిమానుల కోసం మరిన్ని ‘స్పెషల్స్’తో సిద్ధం చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ నెల 22వ తేదీన మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా విడుదల కానుంది. ప్రస్తుతం మెగా అభిమానుల చూపులన్నీ ఆ తేదీ పైనే..!

ADVERTISEMENT
Latest Stories