యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం… అంతకంతకు పెద్దగా మారుతుంది. ఇప్పటికే ఈ పాన్ – ఇండియా సినిమా కోసం దీపికా పదుకోనె హీరోయిన్ గా తీసుకుని రేంజ్ పెంచారు. తాజాగా లెజెండ్ అమితాబ్ బచ్చన్ ను ఒక కీలక పాత్రకు తీసుకుని మరో మెట్టు పైకి ఎక్కించారు.
ఇప్పటివరకు తెలుగులో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రలన్నీ చిన్నవే… అయితే ఈ సినిమాలో మాత్రం ఆయన పూర్తి నిడివి గల పాత్రలో కనిపించనున్నారు. “ఆయన అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని మేం నమ్ముతున్నాం” అని దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సందర్భంగా ఉద్వేగంగా తెలిపారు.
బిగ్ బీకి పూర్తి నిడివి గల పాత్ర అంటే విశేషమే. ఇది బాలీవుడ్ లో సినిమా రేంజ్ భారీగా పెరుగుతుంది. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. 2022లో సినిమా విడుదల అవుతుంది. 2021లోనే ప్రభాస్ తన బాలీవుడ్ చిత్రం ఆదిపురుష్ కూడా సెట్ మీదకు వెళ్తుంది.
ఈ రెండు సినిమాలకు ఒకేసారి షూట్ చేస్తాడు ప్రభాస్. అంతకంటే ముందు రాధే శ్యామ్ పూర్తి చెయ్యాలి. ఈ మూడు సినిమాల విడుదల సమయానికి ప్రభాస్ రేంజ్ పాన్ – ఇండియా లెవెల్ లో భారీగా పెరుగుతుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. తెలుగు సినిమాకు ఇది ఖచ్చితంగా గర్వకారణమే.




