‘అభిమానం’ మరీ ‘వికృత’ రూపం దాల్చుకుందా?

Marriages with Amma photosతమిళులు అభిమానిస్తే ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. మానవ మాత్రులకు కూడా దేవాలయాలు కట్టించేటంతగా అభిమానం చూపిస్తారన్నది జగమెరిగిన సత్యమే. అయితే ఈ అభిమానం రానూ రానూ వింత పోకడలను సంతరించుకుంటున్నాయని విమర్శకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.

ఈ నెల ఫిబ్రవరి 24వ తేదీకి తమిళనాడు సిఎం జయలలిత 68వ పుట్టినరోజు జరుపుకోనుంది. దీంతో ‘అమ్మ’పై అభిమానం గుప్పించేందుకు ఏఐఏడిఎంకే పార్టీ నేతలు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘అమ్మ’ 68వ పుట్టినరోజు సందర్భంగా 68 జంటలకు తమ కోయంబత్తూర్ లో సామూహిక వివాహ మహోత్సవం జరిపించారు.

ADVERTISEMENT

వివాహం మంచి కార్యక్రమమే గానీ, ఈ వివాహం పేరుతో ‘అమ్మ’పై చూపించిన అభిమానం పలు విమర్శలకు తావిచ్చింది. కొత్త జంటలకు నుదుట బాసికం కట్టారో లేదో గానీ ‘అమ్మ’ బ్యాండ్లు మాత్రం కట్టారు. అంతేకాదు, మెడలో ‘అమ్మ’ దండలు అలకరించారు. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయి.

దేనికైనా ఓ హద్దు ఉండాలని, అది అభిమానానికైనా..! అంటూ నెటిజన్లు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు కోకొల్లలు. సమయం గడుస్తున్న కొద్ది ‘అభిమానం’ మరింత ‘వికృత’ రూపం సంతరించుకుంటోందని, ఈ తరహా పబ్లిసిటీ మరీ దిగజారుడుతనాన్ని ప్రతిబింబిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories