రాజకీయ నాయకుడి కొడుకుతో హీరోయిన్ నిశ్చితార్ధం!

Amulya - Jagadeesh Marriage Kannada Newsప్రముఖ కన్నడ నటి 23 ఏళ్ళ అమూల్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ కార్పొరేటర్ జీహెచ్ రామచంద్రన్ కుమారుడు జగదీష్ ఆర్ చంద్రతో అమూల్య వివాహం రానున్న మే నెలలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఘనంగా జరిగిన అమూల్య, చంద్ర నిశ్చితార్థం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.

2001లో బాల నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అమూల్య ఇప్పటి వరకు 20కు పైగా కన్నడ చిత్రాల్లో నటించింది. కన్నడ ‘గోల్డెన్ క్వీన్’గా పేరు పొందిన అమూల్య ‘చైత్రదా చంద్రమా’, ‘నాను నన్న కససు’, ‘శ్రావణి సుబ్రహ్మణ్య’, ‘గజకేసరి’ వంటి చిత్రాల్లో నటించింది. ‘శ్రావణి సుబ్రహ్మణ్య’ చిత్రంలో అమూల్య ప్రదర్శించిన అద్భుతమైన అభినయానికి గానూ ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories