రెండు నెలల క్రితంవరకు ఆ నారాసురుడి కిందే పనిచేసింది ఆనం గారూ?

Anam Ramanarayana Reddyనాడు ప్రజలను నరకాసురుడు ఇబ్బంది పెడితే నేడు నారాసురుడు పెడుతున్నాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆనం రామనారయణ రెడ్డి తెలిపారు. ఒకటిన్నర లక్షల కోట్ల అ‍ప్పుతో ఏం చేశారని, ఆర్థికంగా చంద్రబాబు, ఆయన కుటుంబం మాత్రమే లాభపడిందని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పాలన నరకాసురుడిని తలిపిస్తుందన్నారు.

[m9ad]

ADVERTISEMENT

బెల్ట్‌ షాపులు తీసేయ్యలేదని, ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగితే పట్టించుకోలేదని, అవినీతి పెరిగిందని, ఇసుకాసురులు పెరిగిపోయారని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో నారాసురుడి రాజకీయ సంహారంతోనే ఏపీ ప్రజలకు నిజమైన దీపావళి వస్తుందన్నారు. హుదూద్‌, తిత్లీ తుఫాన్‌లతో చంద్రబాబు లబ్దిపోందుతున్నారని ఆరోపించారు.

తుఫాన్‌ బాధితులకు ఎదో సాయం చేస్తున్నట్లు బిల్డప్‌ ఇస్తూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదంతా బానే ఉంది కాకపోతే రెండు మూడు నెలల ముందు వరకు ఆనం రామనారాయణ రెడ్డి ఎక్కడ ఉన్నారు? అదే నారాసురుడు పార్టీలోనే కదా? అక్కడ మంత్రి పదవి అడిగిన సీట్లు ఇవ్వనందుకే కదా బయటకు వచ్చింది? ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండి చంద్రబాబుని చెడా మడా తిట్టి ఆ తరువాత టీడీపీలో చేరడం, ఆ తరువాత వైకాపాకు వచ్చి మళ్ళీ విమర్శలు చేయ్యడం… ఇలాంటి వాటిని హర్షిస్తారా ప్రజలు?

ADVERTISEMENT
Latest Stories