రానా బాటలోనే ఈ ముద్దుగుమ్మ కూడా!

Taapsee Pannu Getting into the Shoes of Top Heroinesతెలుగు నాట ప్రజాధరణ పొందిన ‘బిగ్ బాస్’ కార్యక్రమం, ఇపుడు సినీ ప్రమోషన్స్ కు కూడా బాగా ఉపయోగపడుతోంది. ఇటీవల ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విడుదలకు ముందు వారం రానా ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వెళ్లి చేసిన హంగామా బాగా వర్కౌట్ అయ్యింది. దీంతో ఈ ట్రెండ్ ను కొనసాగించేందుకు తాజాగా “ఆనందో బ్రహ్మా” బ్యూటీ తాప్సీ కూడా సిద్ధమైనట్లు సమాచారం.

భారీ స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకుంటున్న ఈ షోలో తాప్సీ కూడా కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మాదిరే, ‘బిగ్ బాస్’ హౌస్ లోకి తాప్సీ ప్రవేశించిందని, సదరు కార్యక్రమం నేడు గానీ, రేపు గానీ ప్రసారం కావచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఈ విధంగా కూడా ‘బిగ్ బాస్’ కార్యక్రమం రెవిన్యూను రాబడుతూ నిర్వాహకులను ఖుషీ చేస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories