మా “పెద్దోడు” చిత్రాలివి!

Anasuya Bharadwajటీవీ షోల్లో యాంక‌ర్‌గా చేసి మంచి పేరు సంపాదించిన అన‌సూయ, ప్రస్తుతం సినిమాల్లోనూ న‌టిస్తూ బిజీబిజీగా ఉంటోంది. త‌న టీవీ షోలు, సినిమాలు, కుటుంబానికి సంబంధించిన‌ విష‌యాల‌ను ఆమె త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో పోస్ట్ చేస్తూ అందులో యాక్టివ్‌గా ఉంటుంది. ఎవ‌రిన‌యినా విమ‌ర్శించాల‌న్నా ఆమె సోష‌ల్ మీడియాను బాగానే వాడుకుంటుంది. అప్పుడప్పుడు త‌మ ఇంట్లో జరిగే స‌ర‌దా విశేషాల‌ను చెబుతూ త‌న అభిమానుల‌ను అల‌రిస్తోంది.

ADVERTISEMENT

ఇక విషయానికి వస్తే, త‌న పెద్ద కుమారుడు త‌మ ఫ్యామిలీ బొమ్మ‌లు వేశాడ‌ని, అందులో తాను ఎక్క‌డున్నానో చెప్పుకోండ‌ని పేర్కొంటూ ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ స్కెచ్ ను పోస్ట్ చేసింది. ‘క‌ళ్ల‌జోడు పెట్టుకుని ఎడ‌మ‌ ప‌క్క‌న ఉన్న‌ది నువ్వే అన‌సూయ’ అంటూ ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ‘స్కెచ్ లో నీ పోనీ టెయిల్ బాగుంది’ అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. అల‌రిస్తోన్న అన‌సూయ పెద్దకుమారుడి బొమ్మ‌ల‌ని మీరూ చూడండి..

ADVERTISEMENT
Latest Stories