ఏపీకి వైసీపి అవసరమా?అంటే ఆ పార్టీ నేతలు, అభిమానులకు చాలా కోపం రావచ్చు. కానీ ‘అవసరమే’ అంటే టిడిపి, జనసేనలకు కోపం రావచ్చు.
Also Read – పుష్ప పై క్రెజే కాదు రూమర్లు తగ్గట్లా..!
కానీ ఎవరికి కోపం వచ్చినా ఏపీకి, మరీ ముఖ్యంగా టిడిపికి వైసీపి ఉండటం చాలా అవసరమనే చెప్పక తప్పదు. ఎందుకో చూద్దాం.
రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ కాంగ్రెస్, టిడిపిలను అడ్డు తొలగించుకుంటే ఇక తన అధికారానికి, తన పార్టీకి ఎదురే ఉండదనుకుని తొలగించేసుకున్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ బలహీన పడేసరికి దాని స్థానంలోకి దాని కంటే వెయ్యి రెట్లు శక్తివంతమైన బీజేపీ ప్రవేశించింది.
Also Read – నోటి దూల ఫలితం అనుభవించాలిగా..!
అప్పుడు కూడా కేసీఆర్ మరో పెద్ద తప్పు చేశారు. రాష్ట్ర స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే బదులు, మోడీని ఎదుర్కొంటే, తనకు జాతీయ స్థాయి నాయకుడుగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వంతో కయ్యం వలన అసలుకే మోసం వచ్చింది.
ప్రధాని కుర్చీలో కూర్చొని యావత్ దేశాన్ని పాలిద్దామనుకుంటే, తిరుగేలేదనుకున్న తెలంగాణలోనే కేసీఆర్ ఘోరంగా ఓడిపోయి గత 10 నెలలుగా ఫామ్‌హౌస్‌లో కూర్చుంటున్నారు.
Also Read – భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుందేవరు..?
కనుక దీనిలో గుణపాఠం ఏమిటంటే, చిన్న లేదా సమ ఉజ్జీగా ఉన్న శత్రువుని ఎప్పుడు అడ్డు తొలగించుకోకూడదు.
ఒకవేళ తొలగించుకున్నా, తొలగించుకోకపోయినా పెద్ద శత్రువుతో స్నేహమే చేయాలి తప్ప కత్తులు దూయరాదు. ఈ నేపధ్యంలో చూస్తే ఏపీలో వైసీపి ఉండటం చాలా అవసరమని అర్దమవుతుంది.
ముఖ్యంగా 5 ఏళ్ళలో జగన్ పాలన ఎంత భీభత్సంగా ఉందో అందరూ చూశారు కనుక చంద్రబాబు నాయుడు పాలనలోనే సుఖంగా, ప్రశాంతంగా జీవించవచ్చనే విషయం అందరికీ బాగా అర్దమైంది. విలన్ ఉంటేనే హీరోయిజం పండుతుందన్న మాట!
జగన్‌కి ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారా ఇవ్వరా?అనే విషయం పక్కన పెడితే టిడిపి కూటమికి జగన్ పక్కలో బల్లెంలా ఉంటారు.
ఈ ఆలోచన, భయం లేకపోవడం వలననే 2019 ఎన్నికలలో టిడిపి బోర్లా పడింది కదా? కనుక ఈ భయమే టిడిపి కూటమిలోని పార్టీ నేతలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తంగా ఉంచుతుంది. ఇది చాలా అవసరం కూడా.
ఇక బీజేపీ విషయానికి వస్తే, తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలు, కేరళలో కాంగ్రెస్ కూటమి, కమ్యూనిస్ట్ కూటమి సమ ఉజ్జీలుగా ఉన్నందునే బీజేపీ ఆ రెండు రాష్ట్రాలలో అడుగుపెట్టలేకపోతోంది.
అదేవిదంగా ఏపీలో కూడా టిడిపి, వైసీపిలు బలంగా ఉన్నంత కాలం బీజేపీ అడుగుపెట్టలేదు. కనుక ఏపీలో వైసీపి బలంగా ఉండటం చాలా అవసరమే. ముఖ్యంగా టిడిపికి!