ఐపీల్ ను తలపిస్తున్న ఏపీ పొలిటికల్ బెట్టింగ్లు..!

andhra-pradesh-elections-2024-bettings

బెట్టింగ్ అనే పదం వినపడగానే అందరికి గుర్తొచ్చేది ఐపీల్. ఐపీల్ తో క్రికెట్ అభిమానులు ఎంతలా ఎంజాయ్ చేస్తారో అలాగే బెట్టింగ్ బాబులు కూడా అంతలా ప్రలోభాలకు గురవుతారు. ఇప్పుడు ఆ బెట్టింగ్ ఫీవర్ ఏపీ రాజకీయాలను తాకింది.

ADVERTISEMENT

ఇందులో ముందు వరుసలో ఉంది జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం. గత ఎన్నికలలో పోటీ చేసిన భీమవరం, గాజువాక రెండు ప్రాంతాలలో పవన్ ఓటమి చెందడంతో ఈసారి ఆయన పిఠాపురంకు మారారు. అయితే ఈసారి కూడా పవన్ ను ఎలా అయినా అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదనే గట్టి పట్టుదలతో ఉన్న జగన్ పిఠాపురం మీద ప్రత్యేక శ్రద్ద పెట్టారు.

అలాగే జనసేన కూడా ఈసారి ఎన్నికలో గెలిచి అసెంబ్లీలో తన గళం వినిపించడానికి సర్వ శక్తులు ఒడ్డింది. అటు ఇండస్ట్రీ సహకారంతో పాటు ఇటు టీడీపీ బలం కూడా కూడగట్టుని గెలుపు మీద ధీమా గా ఉంది జనసేన. దీనితో పిఠాపురంలో పవన్ గెలుపు మీద కొందరు, ఆయన మెజారిటీ మీద మరికొందరు బెట్టింగులకు పాల్పడుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది.

అలాగే నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసింది వైసీపీ. దీనితో ఈ బెట్టింగ్ బాబాయిలు మంగళగిరిలో ఎగిరేది టీడీపీ జెండానా.? వైసీపీ జెండానా.? అంటూ తమ వృత్తికి న్యాయం చేస్తున్నారు. అలాగే అన్న చెల్లాల సమరంగా సాగుతున్న కడప ఎంపీ స్థానం మీద కూడా షర్మిల VS జగన్ అన్నట్టుగా బెట్టింగ్ బాబులు రెచ్చిపోతున్నారు.

కడప ఎంపీ గ పోటీలు ఉన్నది అవినాష్ రెడ్డి అయినప్పటికీ ఇక్కడ పోరు మాత్రం జగన్ vs షర్మిల కింద మారిపోయింది. దీనితో పాటుగా మరికొన్ని కీలక ప్రాంతాల పై కూడా భారీగా పందెం రాయిడ్లు బెట్టింగ్లతో చెలరేగిపోతున్నారు. వీటిలో గన్నవరం, గుడివాడ, నగరి, ఉండి, సత్తునపల్లి, విజయవాడ సెంట్రల్ బెట్టింగ్ బాబులకు హాట్ సీట్లుగా ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమా..? వైసీపీ పాలనా.? అనేదాని పై కూడా కొన్ని వేల కోట్లు చేతులు మారబోతున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

గెలుపోటములే కాకుండా మెజారిటీ మీద, ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారు అనే దాని పై కూడా బెట్టింగులు కొనసాగడం వారి పైత్యానికి పరాకాష్టగా భావించవచ్చు. మే 13 న జరిగే పోలింగ్ తో రాజకీయ పార్టీల, ఆ పార్టీ నాయకుల భవిష్యత్తు తోపాటు ఈ బెట్టింగ్ బాబుల భవిష్యత్తు కూడా మారే అవకాశం కనపడుతుంది. బండ్లు ఓడలా…ఓడలు బండ్లా…అనేది తేలాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే..!

ADVERTISEMENT
Latest Stories