దసరాకు కాదు.. సంక్రాంతికి రిలీజ్‌!

Vijayasai Reddy Delays New Party Launch, Outlines Gen Z Plans

ఇది సినిమా రిలీజ్‌.. వాయిదా పడటం గురించి కాదు. మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీ రిలీజ్‌ డేట్ గురించి!

మొన్నటివరకు వరుస ప్రెస్‌మీట్స్‌ పెట్టి విజయదశమి నాడు కొత్త పార్టీ ప్రకటిస్తానంటూ ఊదరగొట్టిన విజయసాయి రెడ్డి, “రేపటి నుంచి వారం రోజుల పాటు ఆయుర్వేద చికిత్స నిమిత్తం వెళుతున్నాను. స్థానికసంస్థల ఎన్నికల కోడ్ తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవ తేదీని ప్రకటిస్తానని” మొన్న ఒక ట్వీట్ వేశారు.

ADVERTISEMENT

దానిపై విమర్శలు, విశ్లేషణలు మొదలవడంతో, “పార్టీ పేరు, జెండా, ఎజెండా ఈ పవిత్ర దసరా పర్వ దినాల్లో సిద్ధం అవుతున్నాయి. నేను పార్టీ పెట్టరాదని కోరుకుంటున్న వారంతా చేస్తున్న చౌకబారు ప్రచారాలకు ఎలాంటి విలువా ఉండదు.

రెండు కుటుంబ పార్టీలమీద తిరుగుబాటుగా, ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ మెరికల్లాంటి కొత్త నాయకత్వం తయారు చేస్తా. మరోసారి చెపుతున్నా… అధికారం జెన్‌-జీది, నాది బాల్‌ఠాక్రే పాత్ర,” అంటూ నిన్న మరో ట్వీట్‌ వేశారు.

డిసెంబర్‌ చివరిలోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగియవచ్చు. కనుక విజయసాయి రెడ్డి కొత్త పార్టీ రిలీజ్‌ డేట్ సంక్రాంతికి లేదా పండుగ తర్వాత ఉండవచ్చు. కానీ ఆలోగా మళ్ళీ వైసీపీతో ప్యాచప్ జరిగితే అప్పుడు ఆయన ఏం చెపుతారో చూడాలి.

కానీ తాను బాల్‌ఠాక్రే వంటివాడినని విజయసాయి రెడ్డి చెప్పుకుంటున్నారు. కనుక రాష్ట్రంలో ‘ఒరిజినల్ రెడ్ల’ గౌరవం పెంచేసి, జెన్-జీకి అధికారం కట్టబెట్టి మళ్ళీ అయన అరణ్యవాసానికో, అజ్ఞాతవాసానికో వెళ్ళిపోతారేమో?

ఈ కలికాలంలో కూడా ఇలాంటి త్యాగమూర్తులు మన కళ్ళ ముందే ఉంటే గుర్తించలేకపోతున్నాము. వారినే ఆక్షేపిస్తున్నాము తప్ప ఇలాంటి పుణ్యమూర్తులను చూడటం మన పూర్వ జన్మసుకృతమని అనుకుంటున్నామా? లేదే! పర్వాలేదు తాను సగటు మనిషిని కాను.. బాల్‌ఠాక్రే వంటివాడినని చెప్పుకుంటున్నారు. కనుక అందరినీ తప్పకుండా క్షమించేస్తారు.

ADVERTISEMENT
Latest Stories