దేశవ్యాప్తంగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు గాను భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. మొత్తం 7 ఫెజులలో జరగబోయే ఎన్నికలకు గాను ఏఏ రాష్ట్రంలో ఏఏ తేదీలలో ఎన్నికలు జరగనున్నాయనేదాని పై ఒక స్పష్టత ఇచ్చారు సీఈసీ రాజీవ్ కుమార్.
ఏప్రిల్ 19 న జరగబోయే మొదటి ఫెజ్ తో మొదలయ్యే ఎన్నికల ఘట్టం జూన్ 1 న జరగబోయే చివరి ఫెజ్ తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18 న నోటిఫికేషన్ విడుదలతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరం మొదలయ్యి…మే 13 న పోలింగ్ తో ముగుస్తుందని ప్రకటించారు ఈసీ.
ఈ నేపథ్యంలో ఏపీలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. ఏప్రిల్ 18 న ఎన్నికల నోటిఫికేషన్ కాగా నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 25 గా, నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 గా, అలాగే నామినేషన్ల ఉపసంహరణ తేదీని ఏప్రిల్ 29 గా ప్రకటించారు.
మే 13 న జరిగే పోలింగ్ ఓట్లను లెక్కించి జూన్ 4 న ఫలితాలు విడుదల చేయనున్నారు. దీనితో ఇక ఎన్నికల కౌంటింగ్ కు వేళయరా…అంటూ అన్ని రాజకీయ పార్టీలు..,అందరూ రాజకీయ నాయకులు సభలు సమావేశాలతో మైకుల ముందు చేసే ప్రసంగాలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం.
అలాగే తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు గాను ఇవే తేదీలను ఖరారు చేసారు ఎన్నికల అధికారులు. మే 13 న పోలింగ్, జూన్ 4 న ఫలితాలు. దీనితో ఇప్పటి నుంచి ఎన్నికలకు 58 రోజుల ఎన్నికల కౌంట్ డౌన్ షురూ అయ్యినట్లే..!




