పంచాయతీ ఏకగ్రీవాలలో కూటమి టాప్‌… కూటమిలో టీడీపి టాప్‌

Andhra Pradesh Panchayat elections showing unanimous Sarpanch wins by TDP, Jana Sena, BJP and YSRCP supporters.

మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు.

అయితే ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,949 సర్పంచ్ పదవులలో 760, అలాగే 39,832 వార్డు సభ్యుల స్థానాలలో 14,731 ఏకగ్రీవమయ్యాయి.

ADVERTISEMENT

వీటిలో కూటమి మద్దతుదారులు అత్యధికంగా 674, వైసీపీ: 32, ఇతరులు: 13 పంచాయితీలు దక్కించుకున్నారు. వీటిలో టీడీపి: 674, జనసేన: 31, బిజేపి: 5 పంచాయతీలు దక్కించుకున్నాయి.

టీడీపి ఏకగ్రీవాలలో అత్యధికంగా తిరుపతి జిల్లాలోని 404కి 122, అన్నమయ్య జిల్లాలో 85కి 72, పల్నాడులో 173కి 67, ప్రకాశం జిల్లాలో 139కి 61 పంచాయతీలు దక్కించుకున్నారు.

అదేవిధంగా జనసేన మద్దతు ఇచ్చినవారిలో అత్యధికంగా కోనసీమ జిల్లాలో 177కి 8 పంచాయతీలు దక్కించుకోగా, వైసీపీకి చెందినవారు తిరుపతిలో 122కి 9 పంచాయతీలు దక్కించుకున్నారు.

నేడు మొదటి దశలో 3,240 పంచాయతీలకు పోలింగ్‌ జరిగింది. మరికొద్ది సేపటిలో వరుసగా ఫలితాలు వెల్లడవుతాయి.

పంచాయతీ ఎన్నికలతో పాటు నేడు శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో మేయర్, చైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు ఈ నెల 30న వెలువడతాయి.

ADVERTISEMENT
Latest Stories