జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఏపీ డీజీపీ

DGP Gautam - Sawangఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు రెండు వారాల పాటు నగదు వాడటం మానివేయ్యాలని, నగదు రహిత ట్రాన్సక్షన్స్ మాత్రమే చెయ్యాలని ఏపీ డీజీపీ ప్రజలను హెచ్చరించినట్టు ఆయన ఆఫీసు మీడియాకు ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. తూర్పు గోదావరికి చెందిన ఒక వ్యాపారికి కరోనా సోకిందని, ఆయన విదేశాలకు వెళ్ళలేదని, వెళ్లిన వారితో కాంటాక్ట్ కూడా లేదని కావున జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చారు.

అయితే ఈ ప్రెస్ నోట్ తో జగన్ ప్రభుత్వం ఇరుకున పడింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం పెన్షన్లు గానీ, కరోనా సాయం గానీ నగదు రూపంలో వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయిస్తుంది. ఈ మధ్య స్థానిక ఎన్నికలలో ఓటర్లను ఆకర్శించేందుకు పోటీ చేసిన తమ అభ్యర్థులను వారితో పంపిస్తుంది.

ADVERTISEMENT

అయితే వెంటనే ఏపీ డీజీపీ ఆఫీస్ దాని మీద వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. “ఆ లేఖ ను అనవసరంగా సెన్సషనలైజ్ చేస్తున్నారు. అది రొటీన్ గా పంపినదే. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడానికి పంపాము. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని ఇప్పటి వరకూ శాస్త్రీయంగా రుజువు కాలేదు,” అంటూ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 534 కేసులు నమోదు అయ్యాయి. నిన్న సాయంత్రం 7 గంటల నుండి ఈ రోజు ఉదయం 9 గంటలకు రాష్ట్రం లో తొమ్మిది కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కృష్ణ, కర్నూలు, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్క జిల్లాలో మూడు కేసులు చప్పున నమోదయ్యాయి.

ADVERTISEMENT
Latest Stories