
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులను గమనిస్తే ఆంధ్రాలో పూర్తి మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ బలహీనంగా ఉంది. కానీ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొంటోంది.
తెలంగాణలో 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తెచ్చుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడింది. అక్కడ ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ చాలా బలహీన పడినప్పటికీ మళ్ళీ కోలుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొంటోంది.
Also Read – కవిత లో జోష్ బిఆర్ఎస్ కు వరమా.? శాపమా.?
ఫోన్ ట్యాపింగ్, ఎఫ్-1 రేసింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ళలో అవినీతి, అక్రమాలపై రేవంత్ రెడ్డి మొదట్లో చాలా దూకుడుగా వ్యవహరించినప్పటికీ, ఎవరో బ్రేకులు వేసినట్లు హటాత్తుగా వెనక్కు తగ్గడంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను టచ్ చేయలేరని ప్రజలు భావించేలా చేసిందని చెప్పొచ్చు.
కనుక వారిపై రేవంత్ రెడ్డి ఎన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ వాటికి విలువ లేకుండా పోతోంది. అవన్నీ రాజకీయ కాలక్షేపం కోసమే అని ప్రజలు భావిస్తుండవచ్చు.
Also Read – మద్యం కుంభకోణం: రాజకీయ కాలక్షేపమేనా?
రేవంత్ రెడ్డి నిస్సహాయతకు తెర వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. కానీ అవన్నీ ప్రజలకు అనవసరం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ “నాడు నన్ను కేసీఆర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారని” రేవంత్ రెడ్డి శాసనసభలో చెప్పుకోవడం కూడా ప్రజలకు తప్పుడు సంకేతాలే వెళ్తాయి.
సిఎం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిలాగా ఎటువంటి హడావుడి చేయలేదు. కానీ వైసీపీలో తమని ఇబ్బంది పెట్టినవారందరికీ తగిన విదంగా గుణాపాఠాలు చెపుతున్నారు. కనుక వైసీపీని సమర్ధంగా కట్టడి చేయగలుగుతున్నారని భావించవచ్చు.
Also Read – నువ్వు విష్ణువైతే.. నేను గంటా!
జగన్ విచ్చలవిడిగా చేసిన అప్పుల వలన చేసిన ఆంధ్రా ఆర్ధిక పరిస్థితి దయనీయంగా మారినప్పటికీ, సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రం సాయంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చుకోగలుగుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలు కలిగి ఉండటం, ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు కీలకంగా మారడం, ఆంధ్రాకి కేంద్రం సహాయ సహకారాలు లభిస్తుండటం వంటివన్నీ పెట్టుబడిదారులకు సానుకూల సంకేతాలు పంపిస్తాయని వేరే చెప్పక్కరలేదు.
కానీ ధనిక రాష్ట్రమని భావించిన తెలంగాణ కూడా అప్పులపాలవడం, కాంగ్రెస్, బీజేపి రాజకీయాల కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలు లేకపోవడం, కాంగ్రెస్ అధిష్టానం సిఎం రేవంత్ రెడ్డి చేతులు కట్టేయడం, బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న లోపాయికారి రాజకీయాలు వంటివి తెలంగాణకు ప్రతికూలాంశాలుగా మారాయని చెప్పవచ్చు. కనుక అభివృద్ధి, సంక్షేమ పధకాలు, పెట్టుబడుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగలేకపోతోంది.
ఈ నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితిని బేరీజు వేసి చూసిన్నట్లయితే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఖచ్చితంగా చాలా మెరుగ్గా ఉందని అర్దమవుతుంది.