క్రికెట్ : ఔటైన ఆగ్రహం… ఫీల్డర్ ప్రాణం తీసింది..!

Angry cricket batsman throws stump kills 14-year-old fielder ఔటయ్యాననే కోపంతో బ్యాట్స్ మెన్ స్టంప్ విసిరిన సంఘటనలో ఫీల్డర్ దుర్మరణం చెందిన విషాద సంఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది. స్థానికంగా ఉన్న రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక జట్టు బ్యాట్స్ మెన్ తాను ఔటయ్యాననే కోపంలో స్టంప్ ను గాల్లోకి గట్టిగా విసిరాడు.

అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న పధ్నాలుగు సంవత్సరాల ఫైజల్ హుస్సేన్ మెడ వెనుక భాగంలో బలంగా దిగింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ… సదరు బ్యాట్స్ మన్ ఉద్దేశ పూర్వకంగా స్టంప్ విసరలేదనే కోణంలో కేసు నమోదు చేశామన్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories