సినిమా ట్రెండ్ మారుతుంది..ఒకప్పుడు పౌరాణికాలు..ఆ తర్వాత సాంఘికాలు…అటుపై ప్రేమ కధలు..మరో పక్క ఫ్యాక్షన్ కధలు..ఇలా వరుసగా ట్రెండ్ ఎప్పటికపుడు మారుతూ వస్తుంది. అయితే ఇప్పుడు నడుస్తుంది మాత్రం బయోపిక్స్ ట్రెండ్.
‘మహానటి’ తో మొదలయిన ఈ ట్రెండ్ తాజాగా మహా మనిషి ‘ఎన్ఠీఆర్’ సినిమాతో ముందుకు సాగుతుంది, ఇక పనిలో పనిగా, ‘వైఎస్సాఆర్’ బయోపిక్, కూడా తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అందరి కళ్ళు ఇటు అక్కినేని బయోపిక్ పైనా, అటు బాలీవుడ్ లో శ్రీదేవి బయోపిక్ పైన పడ్డాయి.
మీడియాలో ప్రతీ చోట ఇదే టాపిక్, ఇప్పటికే అటు నాగార్జున, ఇటు బోణి కపూర్ దీనిపై క్లారిటీ ఇచ్చేసారు. ఇప్పటికైతే అసలు అలాంటి ఆలోచన ఏం లేదు అని, తెరకెక్కించాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కథ సిద్ధం చేసుకునే చెప్తాము అంటూ ఇప్పటికే ఆ ఇరు కుటుంబాలు క్లారిటీ ఇచ్చాయి.
అయితే ఈ ఇద్దరిలో బోణి కపూర్ పక్కాగా ఇప్పుడు లేదు అని చెప్పెయ్యగా…నాగ్ మాత్రం “ఉంది – లేదు” అని చెప్పకుండా మీడియాకు మసాలా వార్తలు రాసుకోవడానికి లీక్స్ ఇస్తున్నట్లుగా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ రెండు బయోపిక్స్ కూడా మనం చూసే అవకాశం త్వరలో తప్పక ఉంటుంది అని ఆశిద్దాం.



