కల నిజమాయెను… పవన్ తో అవకాశం..!

Anu Role In Pawan Kalyan - Trivikram Srinivas Movie“పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో నటించే ఆఫర్ ఎవరికైనా వస్తే ఎలా ఉంటుంది? కాళ్లు గాల్లో తేలిపోయినట్టుంటుంది కదా… నాక్కూడా అచ్చం అలాగే అనిపించింది” అంటోంది వర్థమాన నటి అను ఇమ్మాన్యుయేల్. ‘కిట్టుగాడున్నాడు జాగ్రత్త’ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్ గురించి చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ లో ఎంతోమంది పవన్ కళ్యాణ్ తో నటించాలని ఆశపడుతుంటారని, అలాంటిది తన లాంటి వర్థమాన నటికి పవన్ తో సినిమా అనగానే చాలా గొప్పగా ఫీలయ్యానని చెప్పింది. ఒక రకంగా చెప్పాలంటే తన కల నిజమైందని, ఇంకా తెలుగులో అల్లు అర్జున్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులతో నటించాలని ఉందని తెలిపింది. నాని, రాజ్ తరుణ్ ఇద్దరూ సహనటులతో బాగా మసలుకుంటారని, ఇద్దరూ చాలా కష్టపడతారని చెప్పింది. తన కెరీర్ ఆరంభంలోనే మంచి అవకాశాలు తలుపు తట్టడం తన అదృష్టమని తెలిపింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories