టెంప్టింగ్ ఆఫర్ అయినా వద్దు అనేసింది

Anushka refused netflix tempting offerఅనుష్క ఇటీవలే కాలంలో సినిమాలు బాగా తగ్గించేసింది. ఆమె చివరిసారిగా నిశ్శబ్డం అనే సినిమాలో కనిపించింది. ఆ సినిమా దాని థియేట్రికల్ విడుదలను దాటి…. నిరుడు లాక్ డౌన్ సమయంలో నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయ్యింది. కానీ సినిమా ఘోరంగా విఫలమైంది.

అప్పటి నుండి ఆమె ఇంకో సినిమా మొదలు పెట్టలేదు. యువి క్రియేషన్స్ అనుష్కతో కలిసి ఒక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు పుకార్లు ఉన్నాయి. రా రా కృష్ణయ్య ఫేమ్ మహేష్ దర్శకత్వం లో వస్తున్న ఆ సినిమాలో ‘జాతిరత్నలు’ నవీన్ పోలిశెట్టి హీరో అని సమాచారం. మరొక వైపు, ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఆమెకు ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఆఫర్ ఇచ్చిందని పుకార్లు ఉన్నాయి.

ADVERTISEMENT

దీనికి స్క్రిప్ట్‌ను తెలుగు స్టార్ దర్శకుడు రాశారట. అనుష్కకు స్క్రిప్ట్ నచ్చింది కాని మొదట యువి క్రియేషన్స్‌తో సినిమా చేయడానికి ఆమె ఆసక్తి కనబరుస్తోందట. నెట్‌ఫ్లిక్స్ సాధారణంగా ఒక చిత్రానికి ఆమెకు ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే కూడా ఎక్కువ ఇవ్వజూపిందట. అయినా ఆమె టెంప్ట్ కాకుండా ప్రస్తుతానికి నో చెప్పేసిందని సమాచారం.

ప్రస్తుతం తన కేరీర్ ఉన్న పరిస్థితి లో యూవీ క్రియేషన్స్ సినిమా చెయ్యడమే ఉత్తమం అని ఆమె ఆలోచనట. అంటే అనుష్క ఓటీటీ అరంగేట్రం కోసం మనం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఒకవేళ ఈ నెట్ ఫ్లిక్స్ ఆఫర్ గనుక అనుష్క ఒప్పుకుని ఉంటే సమంత, తమన్నా, కాజల్ తరువాత డిజిటల్ అరంగేట్రం చేసిన మరో తెలుగు హీరోయిన్ అయ్యేది.

ADVERTISEMENT
Latest Stories