అనుష్క కి నిజంగా అంత సీన్ ఉందా? పబ్లిసిటీ స్టoటా?

Anushka Shettyపిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం భాగమతి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తమిళ రైట్స్ ను స్టూడియో గ్రీన్ సంస్థ భారీ ధరకు తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన అనుష్క సినిమా రైట్స్ దాదాపు 15 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారట.

ADVERTISEMENT

అయితే అనుష్క కు నిజంగా తమిళ్ లో అంత క్రేజ్ ఉందా అంటే లేదు అనే చెప్పుకోవాలి. క్రేజీ డైరెక్టరా అంటే అది కాదు. కాబట్టి ఈ వార్తలు కేవలం పబ్లిసిటీ స్టాంటా? అనే అనుమానం రాకమానదు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ (జనతా గారేజ్ నటుడు) లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories