ఏపీలో టీడీపీ పార్టీ పై,ఆ పార్టీ నేతల పై సిఐడి అధికారుల నోటీసుల పరంపర నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది.విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు మొదలుపెట్టిన సిఐడి అధికారులు ఇప్పుడు పార్టీ ఖాతాల వివరాలు అందచేయాలంటూ ముందుకెళ్తున్నారు.
వైసీపీ పార్టీ ప్రభుత్వ ఒత్తిడితోనే సిఐడి అధికారుల చర్యలు ఉంటున్నాయనడానికి ఈ నోటీసులు సాక్ష్యాలు అంటున్నారు టీడీపీ శ్రేణులు. రేపు చంద్రబాబు బెయిలు పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఈరోజు మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకి నోటీసులు అందచేశారు సిఐడి కానిస్టేబుల్. స్కిల్ స్కాములో జరిగిన అవినీతి సొమ్మును చంద్రబాబు మరో ఖాతాలోకి జమచేశారంటూ ఆరోపిస్తున్న సిఐడి అధికారులు ఇంతవరకు సరైన ఆధారాలు చూపలేకపోయారు.
టీడీపీ పార్టీకి సంబందించిన విరాళాలు, బ్యాంకు ఖాతాల లావాదేవీలు ఈ నెల 18 వ తేదీలోపు తమకు సమర్పించాలంటూ సిఐడి తన నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే సిఐడి అధికారులు కేసులు ,నోటీసుల రూపంలో తమను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందిపెడుతున్నారంటూ టీడీపీ కూడా హైకోర్టును ఆశ్రయించింది.భారీ సంఖ్యలో విరాళాలు సేకరించిన వైసీపీ పార్టీని వదిలి ప్రతిఏడాది తమ లెక్కల చిట్టా పొద్దునే ప్రజలు ముందు ఉంచే తమపై సిఐడి అధికారులు ఇలా వ్యవహరించడం కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమే అంటున్నారు టీడీపీ నేతలు.




