
గత ఎన్నికలలో 151 సీట్లతో రాష్ట్రంలో వైసీపీ ఫ్యాన్ గాలి ఫెను తుఫాన్ నే సృష్టించింది.సైకిల్ ఇంటి ముందు ఉండాలి…గాజు గ్లాస్ షింక్ లో ఉండాలి…ఫ్యాన్ ఇంటి లోపల ఉండాలి అని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన జగన్ కు అవును ఫ్యాన్ ఇంటిలోపలే ఉండాలి కానీ 151 తో కాదు 5 చాలు అని తమకు కావాల్సిన 5 తీసుకుని మిగిలిన ఆ రెండు అంకెలు 11 జగన్ కే వదిలేసారు ఓటర్లు.
దీనితో జగన్ కు వచ్చిన 11 స్థానాల పై ఎవరికీ వారు న్యూమరాలజీ సిద్దాంతాన్ని వర్ణిస్తున్నారు. ఆడుదాం ఆంధ్రా అంటూ ఏపీ రాష్ట్ర ప్రజలతో జగన్ ఆడిన ఒక్క ఛాన్స్ ఆట ముగిసింది, ఇక వైసీపీ నేతలు మేమిచ్చే తీర్పుతో మీరు క్రికెట్ ఆడుకోండి అంటూ ఒక క్రికెట్ టీం కు సరిపడా అభ్యర్థులను మాత్రమే గెలిపించారు ఏపీ ఓటర్లు అంటూ కొందరు అభివర్ణిస్తున్నారు.
Also Read – బురద జల్లుతున్నా బాబు ప్రతిష్ట ఇలా పెరిగిపోతోందేమిటి?
అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు రాజధాని అమరావతి ప్రాంతాన్ని సందర్శించి గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతి రైతులు చేసిన ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు. జగన్ ప్రభుత్వంలో 1631 రోజుల పాటు సాగిన అమరావతి రైతుల ఉద్యమ దీక్ష మొత్తాన్ని లెక్కిస్తే వచ్చింది కూడా 11 సంఖ్యనే అదే దేవుడి స్క్రిప్ట్ అంటూ జగన్ కు కౌంటర్ వేశారు బాబు.
నేను అర్జునుడిని జరగబోయేది కురుక్షేత్రం అంటూ పురాణాలను కూడా రాజకీయాలలోకి తీసుకువచ్చిన జగన్ కు ఆ పాండవులు కూడా అండగా ఉండలేదా అన్నట్టుగా పాండవులకు ప్రతీకగా ఉండే 5 అంకెను జగన్ దగ్గర నుంచి లాగేసుకున్నట్లుగా 151 లో 5 తీసుకున్నారు అంటూ మరికొందరు వైసీపీ ని ట్రోల్ చేస్తున్నారు. గతంలో 23 ను అడ్డుపెట్టుకుని టీడీపీ పార్టీ తో పాటు బాబు ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసారు జగన్ అండ్ కో.
Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?
కానీ ఇప్పుడు అదే న్యూమరాలజీని వాడుకుంటూ 11 తో జగన్ ను ఎవరికీ నచ్చిన తీరులో వారు ఒక ఆట ఆడుకుంటున్నారు. మొన్నీమధ్య నవీన్ చంద్ర నటించిన ELEVEN (11 ) మూవీ ప్రెస్ మీట్ లో కూడా ఈ మూవీ పేరు మీద మీడియా మిత్రులు సెటైర్లు వేశారు. ఇప్పుడు ఏపీలో ఈ 11 నెంబర్ ట్రెండింగ్లో ఉంది కదా అని మీరు ఈ నెంబర్ ని పేరుగా ఎంచుకున్నారా అంటూ ప్రశ్నలు కూడా సంధించారు.
ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అంటే
అమరావతి రైతుల ఉద్యమం 1631 రోజులు
1+6+3+1 = 11
జగన్ కు వచ్చిన సీట్లు పదకొండు#YSJagan pic.twitter.com/ak745GreFW
— M9 NEWS (@M9News_) June 20, 2024