అవన్నీ మేం తెచ్చినవేగా… ఇవిగో ఫోటోలు!

Political dispute over Andhra Pradesh investment claims and development projects

అవునా? ఆ పెద్దాయన, వాళ్ళబ్బాయి కలిసి రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంటే, నమ్మేయడానికి ఇక్కడ ఎవరైనా చెవిలో క్యాలిఫ్లవర్ పెట్టుకొని కూర్చున్నారా?

మేమే తెచ్చామని వాళ్ళు చెప్పుకుంటున్న ఆ కంపెనీల ప్రతినిధులతో మేము ఎప్పుడో ఫోటోలు దిగాము. ఒప్పందా పత్రాలపై ఎప్పుడో సంతకాలు కూడా చేశాము. కావాలంటే ఆ ఫోటోలు, పత్రాలు మా పేపర్లో అచ్చేశాము చూసుకోవచ్చు.

ADVERTISEMENT

మేము ఇంత శ్రమపడి ఏపీకి అన్నీ సాధించిపెడితే ఒకటీ సాదించలేదు… ఉన్నవాటిని తరిమేశాము.. సంతకాలు పెట్టినోళ్ళు మావాళ్ళ ప్రతాపం చూసి హడలిపోయి మళ్ళీ ఇటుకేసి తిరిగి చూడకుండా పారిపోయారంటూ ఆ తండ్రీ, కొడుకులు ఇద్దరూ ఒకటే నస పెడుతున్నారు.

ఏమంటే లూలూ… అమర్ రాజా అంటూ మా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. మాకెంత పరువుందో… దాని విలువెంతో తెలియక ఆగిపోయాము కానీ లేకుంటే ఈ పాటికి పరువు నష్టం దావా వేసే ఉండే వాళ్ళమే… బ్రతికిపోయారు!

అయినా ఈ పెద్దాయన 2014-19 వరకు ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారో… వాటిలో ఎన్ని వచ్చాయో మాకు తెలీదనుకున్నారా? ఆ లెక్కలు కూడా మా దాంట్లో అచ్చేశాము… చూసుకోండి. ఆయన తర్వాత మేము అధికారంలోకి రావడం వల్లనే అన్నీ ఆగిపోయాయంటూ మమ్మల్ని నిందిస్తూ ఎంత తెలివిగా తప్పించుకుంటున్నారో? అయినా ఆ కంపెనీలు రాకపోతే దానికి మాదా బాధ్యత?

మా పధకాలు కాపీ కొడతారు. కానీ అమలు చేయలేరు. మా పాలనని కూడా కాపీ కొడుతున్నారు కానీ మాలాగ చేయలేకపోతున్నారు. ఆ పెద్దాయనని మేము ఎత్తి జైల్లో వేశాము. వాళ్ళు కనీసం అదీ చేయలేకపోతున్నారుగా! మా దరిదాపులకి కూడా రాలేకపోతున్నారు. ఆ పవన్‌ కళ్యాణ్‌ హెలికాఫ్టర్‌లో తిరిగి మా కబ్జా భూములు ఫోటోలు, వీడియోలు తీస్తే మేమైనా బెదిరిపోతామా?బాబాయ్ కేసుతోనే ఆడేసుకుంటున్న మాకు ఇలాంటి పిల్ల కేసులు ఓ లెక్కా?

మా పధకాలు, పాలన కాపీ కొట్టేస్తున్నారు కానీ సరిగ్గా కాపీ కొట్టలేకపోతున్నారు సరే! చివరికి మా కార్యక్రమాలను కూడా కాపీ కొట్టేయాలా?

మేము వందల కోట్లు ఖర్చు చేసి విశాఖలో గ్లోబాల్ సమ్మిట్ సెట్టింగ్ వేసి చాలా హడావుడి చేశాము. ఈ ముసలాయన, ఆ పిల్లాడు అది కాపీ కొట్టేసి విశాఖలోనే సమ్మిట్ ఏర్పాటు చేశారు. కాపీ కొట్టడానికైనా ఓ హద్దు ఉంటుంది.

వాళ్ళు కూడా అచ్చం మాలాగే హడావుడి చేస్తుంటే ఏమనాలో మాకు అర్ధం కావడం లేదు. దీనినీ కాపీ కొట్టిన వాళ్ళు తర్వాత కూడా మేము ఏం చేశామో సరిగ్గా అదే చేస్తారు.

ఆ ఒప్పంద పత్రాలన్నీ కట్టకట్టి మేము అప్పుడే అటక మీద పడేశాము. వీళ్ళు అదే చేస్తారు. అచ్చం మాలాగే మళ్ళీ వచ్చే ఏడాది ఇలాగే కొత్త సెట్టింగ్ వేసి కొత్త డ్రామా ఆడుతారు. మేము ఇలాంటి డ్రామాలు ఎన్ని ఆడామో లెక్కేలేదు. హనుమంతుడు ముందా కుప్పిగంతులు?

అయినా మా వల్ల కాని పనులు వీళ్ళవల్ల అవుతుందా?ఈ కంపెనీలు పెట్టడం, ఉద్యోగాలు కల్పించడం అంతా పెద్ద తలనొప్పి వ్యవహారమనే కదా… మేము మూడు రాజధానులు, సంక్షేమ పధకాలు, రంగులు, పేర్లు, కూల్చివేతలు, కేసులతో హాయిగా 5 ఏళ్ళు కాలక్షేపం చేసేశాము.

కానీ వీళ్ళేదో ఊడబొడుస్తామంటున్నారు. అదీ చూద్దాం!

ఎలాగూ మళ్ళీ మనమే వస్తాం కదా? అప్పుడు ఏ కంపెనీ కూడా జీవితంలో మళ్ళీ ఏపీ వైపు కన్నెత్తి చూడకుండా తన్ని తరిమేస్తాం! జస్ట్ ఇంకో మూడేళ్ళు అంతే! అంత వరకు ఎన్ని స్టోరీలైనా చెప్పుకోండి… ఎన్ని డ్రామాలైనా ఆడుకోండి!

ADVERTISEMENT
Latest Stories