Are BRS Struggles a Curse on Telangana

కేంద్రంతో పోరాడి తెలంగాణ సాధించుకున్న మాట వాస్తవం. అక్కడితో ఆ పోరాటాలు ముగించి ఉంటే తెలంగాణకు ఎంతో మేలు కలిగేది. కానీ బిఆర్ఎస్ పార్టీ తన రాజకీయ మైలేజ్ కోసం ‘పోరాటాలు’ను బ్రాండ్ ఇమేజ్‌గా మార్చుకోవడంతోనే తెలంగాణకు సమస్యలు మొదలయ్యాయి.

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోయింది. కానీ ముఖ్యమంత్రులుగా చేసిన చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా కేంద్రంతో ఘర్షణ పడాలనుకోలేదు.

Also Read – కన్నీటికి ‘కోటా’ లేదు…

2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కేంద్రంతో పోరాడినందుకు రాజకీయంగా ఆయన, టీడీపీ నష్టపోయింది. ఆ కారణంగానే జగన్‌ అధికారం చేజిక్కించుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.

కనుక సిఎం చంద్రబాబు నాయుడు ఆ తప్పుని సరిచేసుకొని మళ్ళీ కేంద్రంతో సఖ్యతగా ఉంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు.

Also Read – కూటమి పై సామాన్యుడి ఆగ్రహం…

కానీ ఎప్పుడూ ఎవరో ఒకరితో పోరాడుతూనే ఉండాలనే బిఆర్ఎస్ విధానం వలన తెలంగాణ రాష్ట్రం, ప్రజలు భారీ మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు.

జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకున్న కేసీఆర్‌ ప్రధాని మోడీని ధైర్యంగా ఢీకొనడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలనుకున్నారు.

Also Read – ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ పవన్‌ కళ్యాణ్‌

సిఎం చంద్రబాబు నాయుడుతో నీళ్ళ కోసం కీచులాడుతూ తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతున్న వ్యక్తిగా, పార్టీగా గుర్తింపు సంపాదించుకున్నారు.

కానీ రాజకీయ కారణాలతో చేసిన ఆ పోరాటాలతో ఆయన, బిఆర్ఎస్ పార్టీ మంచి గుర్తింపు పొందినప్పటికీ, వాటి కారణంగానే ఆయన, బిఆర్ఎస్ పార్టీ, కూతురు కవిత, తెలంగాణ రాష్ట్రం, ప్రజలు అందరూ నష్టపోయారు కదా?

బిఆర్ఎస్ పార్టీ నీళ్ళ కోసం పోరాడదలిస్తే ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటకలతో పోరాడాలి కానీ దిగువన ఉన్న ఆంధ్రాతో పోరాడుతుంటుంది. ఎందుకు? అంటే ఎగువన ఉన్న రాష్ట్రాలతో పోరాడినా రాని రాజకీయ మైలేజ్, దిగువనున్న ఆంధ్రాలో సిఎం చంద్రబాబు నాయుడుతో పోరాడుతుంటే వస్తుంది కనుకనే! అందుకే బనకచర్ల పేరుతో మరో పోరాటం మొదలు పెట్టారు.

బనకచర్ల పేరుతో రాజకీయ మైలేజ్ కోసం బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కూడా ఒత్తిడి ఏర్పడింది కనుక అయిష్టంగానే ఆంధ్రాతో పోరాటాలకు సిద్దపడక తప్పడం లేదు. కానీ నేటికీ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తెలంగాణతో ఘర్షణకు దిగాలనుకోవడం లేదు. సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుండామని హితవు పలుకుతున్నారు.




కనుక బిఆర్ఎస్ స్వార్ధ రాజకీయాల కోసం చేస్తున్న ఈ పోరాటాలే తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి శాపంగా మారుతున్నాయని చెప్పక తప్పదు.