‘లిప్ లాక్’ పోస్టర్ల వలన బస్సు ప్రమాదాలు!

Arjun Reddy Movie Lip Kiss Poster controversyవిజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి” సినిమా ప్రీమియర్ షో మరికొద్ది గంటల్లో పడనుంది. అయితే సినిమా మాత్రం వినాయకచవితి పర్వదినాన శుక్రవారం నాడు విడుదల కానుంది. ‘పండగ నాడు ఇలాంటి నీచమైన సినిమాలు విడుదల కావడం ఏంటి?’ అంటూ కాంగ్రెస్ నేత వీహెచ్ మరోసారి ఫైర్ అయ్యారు. హీరోహీరోయిన్లు లిప్ లాక్ చేసుకున్న పోస్టర్లను బస్సులకు అతికించారని, వీటి వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలాంటి పోస్టర్లను అంటించకూడదని మండిపడ్డారు.

ADVERTISEMENT

విజయ్ దేవరకొండ మరియు రాంగోపాల్ వర్మలు సోషల్ మీడియాలో వీహెచ్ ను చాలా తక్కువ చేసి మాట్లాడడంతో, కోపోద్రిక్తులైన వీహెచ్, ఈ సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ హైదరాబాద్ లో సెన్సార్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వర్మపై అయితే “సిగ్గున్నదరా భయ్… నువ్వసలు దర్శకునివేనా? సమాజానికి ఇట్లాంటివి చెబుతావా? తాతయ్య మనవడి దగ్గరకు వెళ్లి, బాబూ ముద్దెట్ల బెడతవురా? అని నేర్చుకోవాలా? తాతయ్యకు తెలియదరా భయ్…” అంటూ నిప్పులు చెరిగారు.

సినిమాలు అమ్ముకోవడమే లక్ష్యమా? సమాజం, విలువలు, సంస్కారం వంటివి లేవా? పనిలేక ఇలాంటివన్నీ చెబుతున్నవా? మంచి సినిమాలు తీసి సమాజ ఉన్నతికి పాటు పడాలి కానీ, ఇలాంటివి సమర్థిస్తవా?” నీకు సినిమాలు తియ్యనికి చేతకాకపోతే గమ్మున కూర్చోవాలని, పని లేక ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇలాంటి వైఖరిని సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని, అలా చేయకపోతే విశృంఖల విధానాలకు చొరవచూపుతారని, మన సమాజాన్ని మనమే బాగు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ADVERTISEMENT
Latest Stories