అర్జున్ రెడ్డి… ఏం ట్వీట్ పెట్టవయ్యా..!

Arjun Reddy Could Have Been Super Flop - Sandeep Reddy Vanga “అర్జున్ రెడ్డి” సూపర్ సక్సెస్ తో విజయ్ దేవరకొండ పేరు అలియాస్ అర్జున్ రెడ్డిగా మారిపోయింది. అంతలా బాక్సాఫీస్ వద్ద ‘అర్జున్ రెడ్డి’ సందడి చేస్తుంటే, మరో పక్కన తన ఫేస్ బుక్ ఖాతాలో హీరో విజయ్ కూడా అదే స్థాయిలో హంగామా చేస్తున్నాడు. అయితే తాజాగా ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసిన విజయ్, మొట్టమొదటి ట్వీట్ ఏం చేసారో తెలిస్తే అవాక్కవుతారు. సాధారణంగా ఎవరైనా తమ మొదటి ట్వీట్ మెమరబుల్ గా ఉండాలని, ఏదైనా మంచి వార్తను పంచుకుంటారు.

అలా చేస్తే… అర్జున్ రెడ్డి స్పెషాలిటీ ఏముంటుంది… అందుకే ట్రైలర్ లో ఉన్న ‘ఒరేయ్ అమిత్…’ అంటూ మ్యూట్ అయిన ఓ డైలాగ్ ను తన ఫస్ట్ ట్వీట్ గా వేసి తన మార్క్ ను ప్రదర్శించాడు. తన పేరుతో ఉన్న ‘ఫేక్ ట్విట్టర్ ఖాతాదారులందరికీ’ ఈ వీడియో అంటూ చేసిన ట్వీట్ కు సహజంగానే యూత్ నుండి మాంచి స్పందన లభించింది. ఈ ట్వీట్ తో షాక్ కు గురవ్వడం నెటిజన్ల వంతయ్యింది. ‘మీరు అరాచకం బయ్యా…, యూ ఆర్ అన్ బిలివబుల్’ అంటూ హంగామా చేస్తున్న ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories