ఢిల్లీ లిక్కర్ స్కాములో ముఖ్యమంత్రి అరెస్టు..?

Arvind Kejriwal

ఢిల్లీ లిక్కర్ స్కాములో తీగలాగితే డొంక కదిలినట్టు అగ్ర నేతలు ఒక్కక్కొకరుగా ఈడీ అధికారుల చేతికి చిక్కుతున్నారు. మొన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు కాకా ఇప్పుడు ఆ ప్లేస్ లోకి దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వచ్చేలా ఉన్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించిన విచారణకు గాను 12 మంది సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టు కాబోతున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. దీనికి తగ్గట్లే కెజ్రివాల్ నివాసం చుట్టూ భారీగా భద్రతా బలగాలు చేరుకున్నాయి. ఈ హడావుడి చూస్తున్న ఆప్ పార్టీ నాయకులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తదుపరి కార్యచరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ADVERTISEMENT

దేశ వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈ నేపథ్యంలో సాక్ష్యాత్తు దేశ రాజధాని ప్రాంత ముఖ్యమంత్రి మీదే అవినీతి ఆరోపణలు రావడం…ఇప్పుడు వాటి ఆధారంగా అధికారులు చర్యలకు పాల్పడడం నిజంగా ఆప్ పార్టీకి ఎదురుదెబ్బగానే భావించాలి. నీతి నిజాయితీ తో కూడిన పాలన అందిస్తాం…అవినీతి సమాజాన్ని నిర్మిస్తాం…అవినీతి కోటలు బద్దలు కొడతాం అంటూ ఏర్పడిన పార్టీ పైనే ఇప్పుడు వందల కోట్ల అవినీతి మరకలు అంటడంతో రాజకీయాలలో చెప్పేవాటికి…చేసే వాటికీ అసలు పొంతన అనేదే ఉండదని స్పష్టమయింది అంటూ ఆప్ పార్టీ పై విమర్శలు మొదలయ్యాయి.

అయితే ఇవన్నీ రాజకీయ కక్షలో భాగమే…కేంద్ర ప్రభుత్వం బీజేపీ కనుసన్నలలోనే ఈడీ అధికారులు పని చేస్తున్నారు…మోడీ ఒక నియంతలా మారి తమకు అడ్డువస్త్తున్న వారిపై ఇలా ఈడీ లను పంపి కేసులు బనాయిస్తున్నారు అంటూ బీజేపీ పై మండిపడుతున్నారు ఆప్ నేతలు.

ADVERTISEMENT
Latest Stories