ఏపీ పరువు గంగలో కలిసిపోతోంది… ఎవరైనా ఆదుకొండర్రా

Aswani Dutt Comments On Nandi Awards Controversyతెలంగాణ సిఎం కేసీఆర్‌, మంత్రులు, కేంద్ర ప్రభుత్వంపై ఎంతగా కత్తులు దూస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి సంబందించి జాతీయ అవార్డులు అందుకొంటూనే ఉంది. కానీ ఏపీ మంత్రులు ఎంతగా డప్పు కొట్టుకొంటున్నా ఆంధ్రప్రదేశ్‌కి ఒక్క అవార్డు లభించకపోగా వివిద కారణాలతో తీరని అపఖ్యాతి వస్తోంది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయనే వార్తలు ఏపీ ప్రతిష్టను మంటగాలిపేస్తున్నాయి.

ఇది సరిపోన్నట్లు థాయ్‌లాండ్‌లో ఓ హోటల్‌పై పోలీసులు రైడ్ చేస్తే దానిలో ఏపీకి చెందిన పలువురు గ్యాంబలర్స్ పట్టుబడ్డారు. వారిలో క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌ కూడా ఉన్నాడు. క్యాసినో గురించి వార్తలు వచ్చిన్నప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని పేరు కూడా ప్రస్తావించబడుతుంటుంది. రెండేళ్ళ క్రితం గుడివాడలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్యాసినో నిర్వహిచడమే అందుకు కారణమని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.

ADVERTISEMENT

థాయ్‌లాండ్‌లో పట్టుబడిన వారిలో కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా భారత్‌కు చెందిన 83 మంది ఉన్నారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ, “ఆరోజు కొడాలి నాని, వల్లభనేనీ వంశీ కలిసి గుడివాడలో క్యాసినో నిర్వహించినప్పుడే మేము ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చారించాము. తక్షణం పోలీస్ కేసు నమోదు చేసి వారిద్దరితో సహా తెర వెనుకున్న అందరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాము. కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. అప్పుడే వారిపై చర్యలు తీసుకొని ఉండి ఉంటే నేడు థాయ్‌లాండ్‌లో ఇంతమంది భారతీయులు జైలుకి వెళ్ళవలసివచ్చి ఉండేదా?‘మనవాళ్ళ’ నిర్వాకం వలన థాయ్‌లాండ్‌లో ఇంతమంది భారతీయులు అరెస్ట్‌ కావడంతో ఏపీ పరువు పోయింది. కనీసం ఇప్పటికైనా సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ ‘క్యాసినో బ్యాచ్’ మీద చర్యలు తీసుకోవాలి,” అని పట్టాభిరామ్ అన్నారు.

సినీ రంగంలో ప్రముఖులు కూడా జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లో ప్రముఖ నిర్మాతాలు అశ్వినీ దత్, తమ్మారెడ్డి భరద్వాజ్, ఆదిశేషగిరి రావు తదితరులు పాల్గొన్నారు.

అశ్వినీ దత్ నంది అవార్డుల గురించి మాట్లాడుతూ, “రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు నంది అవార్డులు ఇవ్వడం మానేశాయి. ఏపీలో ప్రస్తుతం వేరే సీజన్‌ నడుస్తోంది. కనుక త్వరలోనే ఉత్తమ గుండా, ఉత్తమ రౌడీ అవార్డులు ఇచ్చే రోజులు వస్తాయేమో?” అని ఎద్దేవా చేశారు. ఈ ఒక్క మాటతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎటువంటి అరాచక పరిస్థితులు నెలకొన్నాయో అశ్వినీ దత్ చెప్పకనే చెప్పేశారు.

వైసీపీ నేతలు ఇసుక మాఫియా, భూ కబ్జాలు చేస్తూ కొండలు కూడా తవ్వేస్తున్నారని నారా లోకేష్‌ సెల్ఫీ ఛాలెంజ్ ఫోటోలతో రోజూ చూపిస్తూనే ఉన్నారు. ఇటీవల కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలలో చంద్రబాబు నాయుడుని పొగిడినందుకు మంత్రులు పోటీపడి ఏవిదంగా మాట్లాడారో అందరూ చూశారు. టిడిపితో పొత్తులు పెట్టుకోవాలనుకొంటున్నందుకు పవన్‌ కళ్యాణ్‌ గురించి ఎంత చులకనగా మాట్లాడుతున్నారో అందరూ వింటూనే ఉన్నారు.

కనుక అశ్వీనీ దత్ చెప్పిన అవార్డులే కాదు… ఇంకా ఉత్తమ బూతుల నేత, ఉత్తమ స్ట్రీట్ డ్యాన్సర్, ఉత్తమ స్ట్రీట్ ఫైటర్ వంటి అవార్డులు కూడా ఈయవలసి ఉంటుందేమో? అని ప్రజలు, ప్రతిపక్షాలు గుసగుసలాడుకొంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories