రాహుల్ ఇన్నేళ్ల కష్టం…సీజేపీ కబ్జా చేసిందా.?

Rahul Gandhi and CJP political debate

2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ని తిరిగి కేంద్రంలో అధికారంలోకి తెచ్చేందుకు సోనియా నుంచి ఆమె తనయుడు రాహుల్ వరకు చేయని ప్రయత్నం లేదు.

రాహుల్ గాంధీ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. రాహుల్ తన రాజకీయంతో బీజేపీ సర్కార్ ను ఒక్క అడుగు వెనక్కి వేయించలేకపోయారు. చివరికి రాహుల్ గాంధీ దేశ వ్యాప్త జోడోయాత్ర(పాదయాత్ర) కూడా కాంగ్రెస్ కి అధికార పీఠాన్ని అందించలేకపోయింది.

ADVERTISEMENT

నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాలు, కరోనా వంటి సంక్షోభాలు కూడా బీజేపీ పట్ల ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టించలేకపోయాయి. అయితే ఇందుకు మోడీ సర్కార్ కున్న రాజకీయం బలం కంటే కూడా విపక్షంలో ఉన్న కాంగ్రెస్ బలహీనతే కారణమని రాజకీయ విశ్లేషకుల వాదన.

ఇండి కూటమి అంటూ రాహుల్ నేతృత్వంలో రాజకీయం మొదలుపెట్టిన రాజకీయ పార్టీలు తీరా ఎన్నికలు రాగానే తలోదిక్కు అన్నట్టుగా వేరు పడడం, ప్రజల సమస్యల పై ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటాలలో చిత్తశుద్ధి లోపించడం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాములు, స్కిములు దేశ భద్రతకు ముప్పు అనే భావన యువతలో ఉండిపోవడం రాహుల్ ఇన్నేళ్ల రాజకీయ కష్టానికి ఫలితం లేకుండా పోయింది.

కానీ సీజేపీ పార్టీ ప్రకటనతోనే యువతను, జెన్ జీలను ఆకట్టుకుంది. ఇక నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ వంటి అంశాన్ని ఎత్తుకోవడమే సీజేపీ తోలి విజయంగా చెప్పవచ్చు. అలాగే ఆ ఎత్తుకున్న నినాదం కు ప్రభుత్వం దిగివచ్చేవరకు కట్టుబడి మోడీ సర్కార్ పై పోరాటం చేయడం కాక్రోచ్ల రెండవ విజయం గా మారింది.

అలాగే తాము తీసుకున్న అంశం సామాన్య ప్రజానీకానికి సంబంధించిన సమస్య కావడం, అది ముఖ్యంగా జెన్ జీ ల అంశం కావడంతో ఢిల్లీ వీధులు మొత్తం బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తాయి. విద్యార్థుల భవిష్యత్ కి సంబంధిన అంశం కావడంతో ఇన్నాళ్లు నోరెత్తని సామాన్యుడి నుండి సినీ సెలబ్రెటీల వరకు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు.

ఇలా తమ ఉద్యమంతో దేశ ప్రజలను కదిలించిన సీజేపీ దశాబ్దాల రాహుల్ రాజకీయ కష్టాన్ని కొన్ని మాసాలలోనే కబ్జా చేసేవారు. అయితే ఆ విజయం రాహుల్ కి మార్గదర్శకంగా మారుతుందా లేదా అనేది చూడాలి..!

ADVERTISEMENT
Latest Stories