ఆంధ్ర వారితోనే తెలంగాణ ప్రభుత్వానికి ప్రాబ్లెమా?

Atchannaidu TDPశనివారం నుండి స్ట్రిక్ట్ లాక్ డౌన్ అంటూ తెలంగాణలో పోలీసులు టైట్ చేశారు. అనుమతి ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్స్ మీద కూడా లాఠీ ఝుళిపించారు. నిన్న ఒక్క రోజే హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 10,000 కు పైగా వాహనాలు సీజ్ చేశారు. మరోవైపు… గతంలో ఏపీ నుండి వచ్చే అంబులెన్సులు ఆపిన తెలంగాణ పోలీసులు తాజాగా మరో రూల్ తెచ్చారు.

ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. కర్ఫ్యూ సడలింపు సమయంలోను పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణీకులకు అనుమతి నిరాకరించారు. అసలు ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సరిహద్దులు మూసేయ్యడంతో…. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ప్రయాణికుల వాహనాలు భారీగా నిలచిపోయాయి.

ADVERTISEMENT

తెలంగాణా సరిహద్దులో ప్రతిసారీ పంచాయితీలేమిటి, అది కూడా మిగతా సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలతో లేని ఇబ్బంది ఒక్క ఆంధ్రప్రదేశ్ తోనే ఎందుకు వస్తుందని పలువురు వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ టీడీపీ అచ్చెన్నాయుడు కూడా ఇరు తెలుగురాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.

“తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అక్కడ ప్రత్యేక చట్టాలేమైనా అమలవుతున్నాయా? ప్రజల ప్రాణాలతో ఇరురాష్ట్రాల సీఎంలు చెలగాటమాడుతున్నారు. ముఖ్యమంత్రికి ప్రజల బాగోగులు పట్టవా? రెండు రాష్ట్రాలు కలిసి ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి తరచు వస్తున్న ఇటువంటి సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ADVERTISEMENT
Latest Stories