దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరగడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూళ్ళు, కాలేజీలు మూసేశారు. పరీక్షలు రద్దు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పదవ తరగతి పరీక్షలు యధాతధంగా జరుగుతాయని భీష్మించుకుని కూర్చుంది. దీనిపై విద్యార్థుల నుండీ, తల్లిదండ్రుల నుండీ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఈ విషయాన్నే టార్గెట్ గా చేసుకుని మాజీ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. సీఎం జగన్‌పై లోకేశ్ అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ప్రతి విద్యార్థి ప్రాణం తమకు ముఖ్యమని తెలిపారు. పబ్బం గడుపుకోవాలని లోకేష్ మాట్లాడిన మాటలు విద్యార్థులను, తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు.
లోకేశ్ చూపిస్తున్న డిగ్రీలు నిజంగా కష్టపడి చదివి సంపాధించి ఉంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు. ఎవరో పరీక్ష రాస్తే లోకేష్ కు స్టాన్ ఫోర్డ్ డిగ్రీ ఇచ్చిందని ఆయన విమర్శించారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
“విద్యా శాఖా మంత్రి అయ్యుండి ప్రపంచ ప్రసిద్ధ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ విలువ తెలీదు. అదేమన్నా ట్యుటోరియల్ కాలేజి అనుకున్నారా ఎవరో పరీక్ష రాస్తే డిగ్రీ ఇచ్చేయ్యడానికి? ఇటువంటి వ్యాఖ్యలతో పక్క రాష్ట్రాలలో రాష్ట్రం కామెడీ అవుతుంది,” అంటూ విమర్శిస్తున్నారు.
ఎవరో పరీక్ష రాస్తే స్టాన్ ఫర్డ్ వాళ్లు డిగ్రీ ఇచ్చారా? అదేమైనా మీరు నడిపే ట్యుటోరియల్ కాలేజి అనుకున్నారా? మరొక దేశంలో అయితే మంత్రిగా ఉండి
ఇలా అడ్డగోలు స్టేట్ మెంట్లు ఇస్తే జైల్లో పెడతారు. pic.twitter.com/y3drgt7xum— Ramesh Kandula (@iamkandula) April 23, 2021
https://twitter.com/B4Politics/status/1385470891929346048





