ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఎట్టకేలకు ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పదోతరగతి పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించామని…. పరీక్షల పై జులైలో మళ్లీ సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం అని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే పరీక్షల నిర్వహణ పై మీడియా ముందు పదే పదే పెద్ద పెద్ద మాటలు చెప్పిన సంబంధిత శాఖా మంత్రి సురేష్ ఇంకా ఈ నిర్ణయాన్ని జీర్ణించుకున్నట్టు లేరు.
టీడీపీ మొండి వైఖరితో ముందుకు వెళుతుందని.. లోకేష్ ఏమి సాధించాలని పరీక్షలు రద్దు చేయాలని అంటున్నారని ప్రశ్నించారు. వాస్తవాలను వాస్తవంగా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉందన్నారు. అంతటితో ఆగకుండా పరీక్షలు రాయకపోతే ఏమైనా కరోనా రాదు అని గ్యారెంటీ ఉందా అని మంత్రి సురేష్ నిలదీశారు.
లోకేష్ ఏం చెప్పాడు…. చంద్రబాబు ఏం చెప్పారు అనేది కాకుండా తమ స్టాండ్ పై తాము నిలబడి ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించాల్సింది. కోర్టులో కనీసం వాదనలను కూడా వినిపించకుండా ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది అంటే తమ వాదనలు నిలబడవు అని ఒప్పుకున్నట్టే కదా?
మరోవైపు ఈ మాటతో ప్రభుత్వం కూడా పరీక్షల వాయిదాల క్రెడిట్ లోకేష్ కి ఇచ్చినట్టు అయ్యింది. ఇక పోతే పరీక్షలు రాయకపోతే ఏమైనా కరోనా రాదు అని గ్యారెంటీ ఉందా అని ప్రశ్నించడం ఇంకా దారుణం. లాక్ డౌన్ పెడితే కరోనా రాదని గారంటీ ఉందా? మాస్క్ పెట్టుకుంటే కరోనా రాదని గారంటీ ఉందా ఇలా అనేక వితండవాదనలు మాములు ప్రజలు చేశారంటే అర్ధం ఉంది ప్రభుత్వంలోని వారు చెయ్యకూడదు.



